By: ABP Desam | Updated at : 12 Jan 2022 05:05 PM (IST)
Edited By: RamaLakshmibai
Makar Sankranti Nadi Snanam
పూజలు, ఆచారాలు అన్నీ స్నానం తోనే మొదలవుతాయి. ఎందుకంటే సరిగా స్నానం చేస్తే అది ఒక వ్యక్తిని మానసికంగా కూడా శుభ్రం చేస్తుందని చెబుతారు. అందుకే అన్ని పవిత్ర స్థలాల్లో చెరువులు, బావులు, కోనేర్లు, కొన్నిచోట్ల నదులు ఉంటాయి. తెలిసీ తెలియక చేసిన చాలా పాపాలు దైవభక్తితో నదీస్నానం చేయడం ద్వారా హరించిపోతాయంటారు. అయితే పుష్కరాలు, కార్తీకమాసంలో నదీ స్నానం ఎంత ముఖ్యమో.. సంక్రాంతి వేళ కూడా నదీస్నానం మంచిదంటారు.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
నిత్యం చేసే పాపాలు
మాటల ద్వారా చేసే పాపాలు: కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పడం, పొంతన లేని, వినలేని మాటలు మాట్లాడడం.
మానసిక పాపాలు: తనది కాని ధనం, వస్తువుల మీద వ్యామోహం, ఇతరులకు ఇబ్బంది కల్గించే పనులు చేయడం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం
శరీరంతో చేసే పాపాలు: అర్హత లేని వారికి దానం ఇవ్వటం, శాస్త్రం ఒప్పుకోని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషుడికి స్వీకరించడం
ఈ పది పాపాలను తొలగించుకునేందుకు నదీ స్నానం చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఏడాదికి ఒకసారైనా నదీ స్నానం చేయాలని చెబుతారు. అయితే ఆగే నీరు కాకుండా పారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదట.
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
స్నానం ఇలా చేయకూడదు
నదుల్లో , కాలువల్లో స్నానం చేసేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానమాచరించాలి
ప్రవాహానికి వాలుగా మగవారు స్నానం చేస్తే వారిలో మగతనం నశిస్తుందట. ప్రవాహానికి ఎదురుగా ఆడవారు స్నానం చేస్తే వారిలో స్త్రీత్వం పోతుందని చెబుతారు. చాలామందికి సంతానం కలగకపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటారు పండితులు.
ఓ నదిలో స్నానం చేస్తున్నప్పుడు మరో నదిని దూషించకూడదు
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
నదీ స్నానం చేసేటప్పుడైనా, నిత్యం ఇంట్లో స్నానమాచరించేటప్పుడైనా ఈ శ్లోకాన్ని చదివితే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందట.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిథమ్ కురు!!
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!
July 2022 Monthly Horoscope : జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి
Monthly Horoscope July 2022: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
Horoscope 1st July 2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి
Panchang 1st July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అన్నపూర్ణ స్తోత్రం
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!