అన్వేషించండి

Maha Shivratri jagran 2023: మహాశివరాత్రి రోజు ఉపవాసం-జాగరణ చేసేవారు చేయాల్సినవి, చేయకూడనివి

ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి. ఈ సందర్భంగా శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణ చేేసేవారు కొన్ని నియమాలు పాటించాలి.. అవేంటంటే...

Maha Shivratri jagran 2023: జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయడం కాదు. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి..పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేదుకే ఉపవాసం, జాగరణ చేస్తారు. అయితే జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. 

Also Read: మహా శివరాత్రి రోజు ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలంటే!

మహా శివరాత్రి జాగరణ-ఉపవాసం నియమాలు

  • మహాశివరాత్రి జాగరణ, ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేచిన వారు చేసే జాగరణ ఫలితాన్నివ్వదు
  • వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భోళాశంకరుడిని పూజించాలి
  • పూజ సమయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
  • జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండాలన్న ఆలోచనతో ఏదో టైమ్ పాస్ చేయడం కాదు... రోజంతా పంచాక్షరి నామస్మరణలో, శివయ్య నామస్మరణలో గడపాలి
  • శివరాత్రి రోజున శివ లింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం
  • శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్థశి తిథి ముగిసేలోగా ఉపవాసం విరమించాలి
  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్కపూట భోజనం చేసి శివనామస్మరణలో గడిపినా మంచిదే
  • శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు లాంటి సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి

Also Read: శంకరుడు కొలువైన పంచభూత క్షేత్రాలివే, వీటిలో మీరు ఎన్ని దర్శించుకున్నారు

మహాశివరాత్రి రోజు చేయకూడని పనులు

  • మహాశివరాత్రి రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు
  • శివారాధన చేసేవారు పొగాకు, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి
  • శివారాధనకు పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు
  • శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు
  • ప్యాకెట్ పాలతో అభిషేకం చేయరాదు..ఆవుపాలతో చేయాలి
  • పూజ మధ్యలో లేవకూడదు
  • పూజ, ఆరాధన మధ్యలో మాట్లాడటం - ఆవేశానికి లోనవడం అస్సలు చేయరాదు
  • జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదంటారు పండితులు
  • శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు

విశ్వనాథాష్టకమ్

గంగాతరంగ రమణీయజటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ | 
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠమ్ | 
వామేన విగ్రహవరేణ కళత్రవన్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

భూతాధిపం భుజగభూషణభూషితాఙ్గం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ | 
పాశాఙ్కుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || 

శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపఞ్చబాణమ్ | 
నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

పఞ్చాననం దురితమత్తమతఙ్గజానాం నాగాన్తకం దనుజపుఙ్గవపన్నగానామ్ | 
దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయమానన్దకన్దమపరాజితమప్రమేయమ్ | 
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిన్దాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ| 
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం  వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాన్తినిలయం గిరిజాసహాయమ్ | 
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||

వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః | 
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనన్తకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ ||

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ | 
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణమ్ ||

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన పొరెల్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Embed widget