News
News
X

Maha Shivratri 2023 Zodiac Signs: మహా శివరాత్రి రోజు ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలంటే!

మహా శివరాత్రి 2023: ఫిబ్రవరి 18 శనివారం శివరాత్రి. మహాశివరాత్రి రోజున భోలేనాథ్‌ను పూజిస్తారు. ఈ రోజున గుడికి వెళ్లి రాశిని బట్టి శివ మంత్రాలను పఠించడం వల్ల మేలు జరుగుతుంది.

FOLLOW US: 
Share:

మహా శివరాత్రి 2023: ఏడాదిలో 12 శివరాత్రిలు ఉంటాయి, అయితే మాఘమాస శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది  ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి వచ్చింది. ఈ రోజు ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపిస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి...

మేషరాశి

మహా శివరాత్రి రోజు పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి..ఓం నాగేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు మహాశివరాత్రి రోజు శివ పంచాక్షరి అయిన ఓం నమః శివాయ అని జపించాలి

మిధునరాశి

మిథున రాశివారు మాహా శివరాత్రి రోజు భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాష్టకం పఠించాలి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు శివుడికి పాలతో అభిషేకం చేసి..శివ చాలీశా పఠించాలి 

సింహ రాశి

సింహరాశి వారు మహా శివరాత్రి రోజు పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి

కన్యా రాశి

మహా శివరాత్రి రోజు కన్యా రాశి వారు శివాష్టకం చదువుకుంటే బోళా శంకరుడి ఆశీస్సులు మీపై ఉంటాయి 

తులారాశి

తులా రాశి వారు శివుడికి భంగ్ సమర్పించిన తర్వాత పంచాక్షరి మంత్రం అయిన  ఓం నమః శివాయ  జపించాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు మహా శివరాత్రి రోజు ఓం పార్వతీనాథాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి

ధనుస్సు రాశి

మహాశివరాత్రి రోజు ధనస్సు రాశివారు శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు ఓం అంగరేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి

మకరరాశి

మహాశివరాత్రి రోజున మకర రాశి వారు ఓం భమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి

కుంభ రాశి

కుంభ రాశి వారు శంకరుడి అనుగ్రహం పొందడానికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించాలి

మీనరాశి

మహా శివరాత్రి రోజు మీన రాశి వారు శివాలయానికి వెళ్లి శివాష్టకం పఠిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది

Also Read: శంకరుడు కొలువైన పంచభూత క్షేత్రాలివే, వీటిలో మీరు ఎన్ని దర్శించుకున్నారు

భక్తులు పిలిస్తే పలికి..వెనకా ముందూ చూడకుండా కరుణ కురిపించే బోళా శంకరుడు కావడం వల్లనే ఎందరో రాక్షసులు ప్రసన్నం చేసుకుని ప్రపంచానికి చేటు తెచ్చే వరాలు పొందారు. రాక్షసులనే కరుణించిన పరమశివుడు నిజమైన భక్తులను ఎందుకు అనుగ్రహించడు..ఎలా పిలిచినా పలుకుతాడు..వరాలు గుప్పిస్తాడు. అయితే ఎలా పలిచినా పలుకుతాడు,పరమేశ్వర అనుగ్రహం అందరిపైనా ఉంటుంది కానీ..మీ రాశిని బట్టి మంత్రం స్మరిస్తే మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మహాశివరాత్రి రోజు శివనామస్మరణ చేయించేందుకు కూడా అనుకోవచ్చు.

నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Also Read: ఆటగదరా శివా - జీవిత చిత్రాన్ని కళ్లముందు ఆవిష్కరించే శివుడి పాటలు మీకోసం

రుద్రాష్టకం 
నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం || 1 ||

నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం |
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం || 2 ||

ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం |
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ || 3 ||

జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం |
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం || 4 ||

ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం |
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం || 5 ||

కలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః |
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః || 6 ||

నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం |
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా || 7 ||

నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం |
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో || 8 ||

రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ

ఇతి శ్రీ రుద్రాష్టకం |

 

Published at : 17 Feb 2023 06:17 AM (IST) Tags: Maha Shivratri 2023 Zodiac Signs Maha Shivratri Horoscope Maha Shivratri Rasiphalalu Rudra Ashtakam shiva panchakshari

సంబంధిత కథనాలు

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!

Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

Political Horoscope:  2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!

ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది

ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి