అన్వేషించండి

Maha Shivaratri 2024: శివుడిని నిరాకారుడిగా లింగరూపంలో ఎందుకు పూజించాలో తెలుసా!

Maha Shivaratri 2024: శివారాధనలో భాగంగా భక్తులు లింగాష్టకం తప్పనిసరిగా చదువుతారు. లింగాష్టకం గొప్పతనం ఏంటి? ఇందులో ప్రతి పదం వెనుకా ఎంత అర్థం ఉందో తెలుసా..!

Lingastakam Lyrics and Meaning

మహాశివరాత్రి రోజు లింగాష్టకం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నిరాకారుడిగా  లింగరూపంలో కొలువైన భోళాశంకరుడికి అత్యంత ప్రియమైన లింగాష్టకం అర్థం ఇదిగో...

బ్రహ్మ మురారి సురార్చిత లింగం -బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం

నిర్మల భాషిత శోభిత లింగం - నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం

జన్మజ దుఃఖ వినాశక లింగం - జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

దేవముని ప్రవరార్చిత లింగం -దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం

కామదహన కరుణాకర లింగం  - మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం

రావణ దర్ప వినాశక లింగం - రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం

తత్ ప్రణమామి సద శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

సర్వ సుగంధ సులేపిత లింగం - మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం - మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం 

సిద్ధ సురాసుర వందిత లింగం - సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !

కనక మహామణి భూషిత లింగం - బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం - నాగుపాముని  అలంకారంగా చేసుకున్న శివలింగం

దక్ష సుయజ్ఞ వినాశక లింగం - దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

కుంకుమ చందన లేపిత లింగం - కుంకుమ , గంధం పూసిన శివ లింగం

పంకజ హార సుశోభిత లింగం - కలువ దండలతో అలంకరించిన లింగం

సంచిత పాప వినాశక లింగం - సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం  -సదా శివ లింగమా నీకు నమస్కారం !

దేవగణార్చిత సేవిత లింగం - దేవ గణాలతో పూజలందుకున్న శివలింగం

భావైర్ భక్తీ భిరేవచ లింగం - చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగం

దినకర కోటి ప్రభాకర లింగం - కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

అష్ట దలోపరి వేష్టిత లింగం -ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం

సర్వ సముద్భవ కారణ లింగం -అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం

అష్ట దరిద్ర వినాశక లింగం - ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

సురగురు సురవర పూజిత లింగం - దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం - నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగం

పరమపదం పరమాత్మక లింగం - ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ 
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే 
(ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)

Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా

 శివుడు గంగాధరుడు, అభిషేక ప్రియుడు. శివుడి మూర్తి, చిహ్నం లేనప్పుడు మట్టితో లింగాన్ని చేసుకుని అయినా పూజించవచ్చు. శివార్చనకు మంత్రాలు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు .  శివనామం ఒక్కటే చాలు. ఓ నమః శివాయ అనే పంచాక్షరాలు పలుకుతూ  ధ్యానించవచ్చు. పంచామృతాలు లేకపోయినా ఆవుపాలు, నీళ్లతో అభిషేకం చేసినా చాలు...

Also Read:  పాలు, నీళ్లు, పంచామృతాలు - శివుడికే అభిషేకం ఎందుకు చేస్తారు!

Also Read: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget