అన్వేషించండి

Madikeri Dasara 2024: కన్నడ, రాజస్థాని సంస్కృతులు కలగలిపిన మడకేరి దసరా!

Navratri 2024: కన్నడ, రాజస్థాని సంస్కృతులు కలగలిపిన మడకేరి దసరా . 10 మంటపాలు.. 4 కరగలు తో అద్భుతంగా జరిగే పండుగ . ఈ వేడుక ఖర్చు మొత్తం ప్రజలదే ...

Madikeri Dasara:  కర్ణాటకలోని మడకేరి ఏరియాలో జరిగే  దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అక్కడ నివసించే కొడుగు జాతి ప్రజలు తమ సొంత ఖర్చులతో  దసరాను వైభవంగా జరుపుతారు. అయితే ఏదో ఒక్క రాక్షసుడుపై సాధించిన విజయంగా కాకుండా అసురులపై దేవతలు సాధించిన విజయానికి నిదర్శనంగా మడకేరి దసరా జరుగుతుంది.

10 మంటపాలు తో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ 

మడకేరి  దసరాకు ప్రత్యేక ఆకర్షణ 8 నుండి 15 అడుగుల ఎత్తున తయారుచేసే మంటపాలు. వీటి తయారీ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఒక్కో మంటపం కమిటీ బృందం లో  50 నుంచి 100 మంది ఉంటారు. ఇలాంటి మంటపాలు మొత్తం 10 ఉంటాయి. ఒక్కో మంటపం కోసం  20 లక్షల వరకు వెచ్చిస్తారు.   ఒక్కో మంటపంలో చిన్న చిన్న వేరు వేరు రకాల దేవతల విగ్రహాలు ఉంచుతారు. ప్రతి  మంటపానికి ప్రత్యేకమైన పౌరాణిక కథల థీమ్ ఉంటుంది. దసరా ఉత్సవాల్లో 9వ రోజు సాయంత్రం నుంచి పదో రోజు  (విజయదశమి ) ఉదయం వరకు ఈ మంటపాలను  ప్రతి ఇంటి మీదుగా ఊరేగిస్తారు. అన్ని మంటపాల్లోనూ టాప్ త్రీ గా నిలిచిన మూడు మంటపాలను కమిటీ ఎంపిక చేసి వాటికి ప్రైజ్ మనీ అందజేస్తారు. రాత్రంతా జరిగే ఈ ఊరేగింపు చూసేందుకు   ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు మడకేరి చేరుకుంటారు. ఈ మడకేరి దసరా లో  కన్నడ సంస్కృతీ తో మంటపాలు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుండి లైటింగ్ బోర్డ్స్,  కేరళ స్టైల్ బ్యాండ్ మేళాలు పాల్గొంటాయి. 

Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!


నలుగురు దేవతలు - నాలుగు కరగలు 

మడకేరి  దసరా కు మరో ప్రత్యేక ఆకర్షణ కరగలు. ఈ ప్రాంతంలో మరియమ్మ పేరుగల దేవతకు నాలుగు ఆలయాలు ఉన్నాయి. దండిన మరియమ్మ,కంచి కామాక్షమ్మ, కుండూరుమొట్టె శ్రీ చౌటి మరియమ్మ, కోటె మరియమ్మ. ఈ నాలుగు ఆలయాలకు నాలుగు కరగలు ఉంటాయి. కరగ అంటే  బియ్యం తో పాటు నవధాన్యాలు ఉంచే కుండ లాంటి పాత్ర. దీనిని దసరా సమయంలో మల్లి, కనకాంబరం,  చామంతి మొదలైన పువ్వులతో అలంకరించి  ఈ ఆలయాల పూజారులు  తల గుండు కొట్టుకుని  రంగురంగుల  బట్టలు ధరించి తమ తలపై  ఈ కరగలు పెట్టుకుని  ఇంటింటికి తిరుగుతారు. అలా తిరుగుతూ అక్కడికి దగ్గర్లోని " పంపిన కర్రే  " ప్రాంతానికి చేరుకుంటారు. వరుసగా 5  రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కరగలను   " శక్తి దేవతలు" గా ప్రజల భావిస్తారు. ఇలా పూజారులు తిరిగే సమయంలో ఒక చేతిలో "బెత్త " అని పిలిచే కర్ర, మరో చేతిలో " కత్తి " పట్టుకుంటారు. ఐదు రోజులు పూర్తయ్యాక  వీటికి ఆయుధ పూజ చేస్తారు.

స్థల పురాణం

చాలా ఏళ్ల క్రితం అంతు బట్టని అంటు వ్యాధితో  మడకేరి ప్రజలు  ఇబ్బంది పడ్డారని, అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు మరియమ్మ దేవతకు  పూజలు, ఊరేగింపులు  జరపడంతో  ఆ వ్యాధి నయమైందని డానికి గుర్తుగా కరగలతో దసరా ఉత్సవాలు ప్రారంభయ్యాయని ఇక్కడి స్థలపురాణం. ప్రతీ యేటా మహాలయ అమావాస్య  ముగిసిన రోజు నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Also Read: దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!

కన్నడ నాట రాజస్థానీ సంస్కృతి మేళ వింపు 

రాజస్థాన్ నుంచి వచ్చి మడకేరిలో  స్థిరపడిన భీమ్ సింగ్ అనే ఆయన మడకేరి దసరాలో మంటపాల ఊరేగింపు సంస్కృతి ప్రారంభించినట్టు చెబుతారు. రాజస్థాన్,మైసూర్ నుంచి చిన్న చిన్న బొమ్మలను తయారు చేసే వాళ్లను రప్పించి వాళ్లతో దేవతా విగ్రహాలు తయారు చేయించి ట్రాక్టర్ పై ఉంచి  దసరా ఉత్సవాల్లో ఊరేగించేవారనీ తర్వాత అదే  ఒక సంప్రదాయంగా మారిపోయిందని మడికేరి ప్రజలు చెబుతారు. భీమ్ సింగ్ కుటుంబీకులు  ఆయన కాలంలో కేవలం 4 పంటపాలు ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్య పదికి చేరిందని  గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా  కన్నడ, రాజస్థానీ, తమిళ,కేరళ సంస్కృతులు కలిపిన మడకేరి  దసరా ను చూడడానికి దేశం నలుమూలల నుండి టూరిస్టులు మడి కేరి పట్టణం వస్తూ ఉంటారు. కర్ణాటకలోని  మడికేరికి బస్సు రూట్ లో మాత్రమే వెళ్లగలం. మైసూర్, మంగుళూరు,బెంగుళూరు,హుబ్బిలి, మధురై, కోయంబత్తూర్ ల నుండి  డైరెక్ట్ బస్సులు ఉంటాయి

Also Read: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget