అన్వేషించండి

Kullu Dussehra 2024 : అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"

Dussehra 2024: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునేదే " కుల్లు దసరా" . ఈ రాజ్యానికి రఘునాథుడే రాజు . హిమాచల్ ప్రదేశ్ లో ఏటా జరిగే ఈ వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఈ విశేషాలు మీకోసం..

Kullu Dussehra 2024 :  మన దేశంలో దసరా అనేది  చాలా ముఖ్యమైన పండుగ అయితే ఒకొక్క ప్రాంతంలో ఒక్కో కారణంతో  దసరా వేడుకలు  జరుపుకుంటారు. సౌత్ ఇండియా , బెంగాల్లోనూ దుర్గాదేవి, మహిషాసురుడ్ని  అంతం చేసిన  సందర్భంగా  విజయదశమి  జరుపుకుంటే, నార్త్ ఇండియాలో  రావణుడి పై రాముడు సాధించిన  విజయాన్ని గుర్తు చేసుకుంటూ దసరా జరుపుతారు.  దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో   వేర్వేరు  కారణాలతో కూడా చిత్ర పండుగ జరుపుకుంటుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది హిమాచల్ ప్రదేశ్ లో చేసే"కుల్లు దసరా "

 కుల్లు లోయకు రాముడే రాజు 

హిమాచల్ ప్రదేశ్ లో  అందమైన లోయ ప్రాంతం కుల్లు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి  రెండు కళ్ళు సరిపోవు అని అంటారు. ఆ లోయలో  ప్రతి ఏటా  విజయదశమి రోజు నుండి  ఏడు రోజులు పాటు  దసరా ఉత్సవాలు జరుపుతారు. కుల్లు రాజ్యానికి రాజైనా, దేవుడైనా రఘునాథుడే. అయోధ్య రామున్ని  "రఘునాథ్" గా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. రఘునాథ్ విగ్రహాన్ని  రథంపై ఉంచి  కుల్లు లోయలో జరిపే రథయాత్రకు  ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ప్రతి ఏటా  ఈ కుల్లు దసరా ను చూడడానికి  5 లక్షల మంది వరకు పర్యాటకులు ఆ చిన్న లోయకు క్యూ కడుతుంటారు.

Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు

అయోధ్య రామున్ని దొంగతనం చేసి జరుపుకునే" కుల్లు దసరా "

కుల్లు దసరా వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 17వ శతాబ్దంలో  కుల్లు లోయను జగత్ సింగ్ అనే రాజు పాలించేవాడు. అదే రాజ్యంలో నివసించే దుర్గాదత్త అనే సాధువు  వద్ద చాలా అందమైన,  విలువైన ముత్యాలు ఉండేవి. వాటి గురించి విన్న రాజు జగత్ సింగ్  ముత్యాలను తనకు ఇవ్వాలని అడగగా దుర్గా దత్ అవి "జ్ఞానానికి సంబంధించిన ముత్యాల"ని రాజుకి ఇవ్వడానికి నిరాకరించాడు. ముత్యాలను తనకు ఇవ్వకుంటే ఉరి తీస్తానని  రాజు హెచ్చరించడంతో వేరే దారిలేని దుర్గాదత్ అగ్నిలోకి దూకి ఆత్మహుతి చేసుకున్నాడు. చనిపోయే ముందు "రాజు తినే తిండి పురుగులతోనూ, త్రాగే నీరు రక్తం గానూ " మారిపోవాలంటూ శపించాడు. ఆ శాపం వల్ల  తిండీ,నీరు లేక బాధపడ్డ  రాజు జగత్ సింగ్ శాపం పోవాలంటే  ఏం చేయాలి అంటూ రామానంది శాఖకు  చెందిన కృష్ణదాస్  పాయహరి అనే పీఠాధిపతిని అడగడంతో అయోధ్య రామున్ని  తీసుకువచ్చి  కుల్లులోయలో ప్రతిష్టించాలని చెప్పాడు. దానితో రాజు ఒక బ్రాహ్మణుడిని  అయోధ్యకు పంపగా  ఆయన అయోధ్యలోని రాముడు విగ్రహాన్ని దొంగిలించుకుని వస్తూ సరయు నది తీరంలో అయోధ్య ప్రజలకు పట్టుపడ్డాడు. వారు ఆయననః ప్రశ్నించగా తమ రాజుకు ఉన్న శాపం గురించి తెలిపాడు. అక్కడే ఒక విచిత్రం జరిగింది. బ్రాహ్మణుడి నుంచి  తీసుకుని రాముడి విగ్రహాన్ని అయోధ్య వైపు ప్రజలు తీసుకెళుతుంటే  అది మోయలేనంతగా  బరువెక్కి పోయింది. అదే కుల్లు లోయ దిశగా  వెళుతుంటే  మాత్రం దూదిపింజలా తేలికగా పోయేది. దానితో రాముని ఆజ్ఞగా భావించి  విగ్రహాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. ఆయన తీసుకువచ్చిన విగ్రహాన్ని రఘునాథ్ పేరుతో కుల్లు రాజ్య సింహాసనం పై ఉంచి దాని పాదామృతాన్ని త్రాగాడు  రాజు జగత్ సింగ్. దానితో ఆయన శాపం తీరిపోయింది. ఆ క్షణం నుంచి రాజ్యానికి రఘునాథుడే రాజు అని  ప్రకటించి ఉత్సవాలు జరపడం ప్రారంభమైంది. దీనినే కుల్లు దసరా  గా పిలుస్తారు. విజయదశమి రోజు ప్రారంభమయ్యే  కుల్లు దసరా ఏడు రోజులు పాటు జరుగుతాయి.   ఈ ఉత్సవాలు 1606 CE నుండి జరుగుతున్నట్టు గుర్తించారు. ఆ ఉత్సవాల టైంలో రఘునాద్ విగ్రహాన్ని  రథంపై ఉంచి  లోయ చుట్టూ  రథోత్సవం జరుపుతారు.  ఈ సమయంలో జరిపే నట్టి ట్రైబల్ డాన్స్ చాలా పాపులర్. 

Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!

 గిన్నిస్ రికార్థుల కెక్కిన నట్టి ట్రైబల్ డాన్స్ 

 కుల్లు దసరా లో ప్రత్యేక ఆకర్షణ నట్టి ట్రైబల్ డాన్స్. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో బాగా పాపులర్. ఈ డాన్స్ లో  వెరైటీలు ఉన్నాయి. కుల్లు నట్టి, మహాసువి నట్టి, సిర్ మౌరి నట్టి, కిన్నౌరి నట్టి,బంగాని నట్టి ఇలా చాలా వెరైటీలు ఈ నట్టి డాన్స్ లు ఉన్నాయి. 2015 అక్టోబర్ 26 న దసరా వేడుకల్లో భాగం గా 9892 మంది మహిళలు కుల్లవి గిరిజన డ్రెస్సుల్లో చేసిన నట్టి డాన్స్ అతిపెద్ద జానపద నృత్యం గా గిన్నిస్ రికార్థుల కెక్కింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget