అన్వేషించండి

శంఖారావం పూరించేది అందుకే, ఇన్ని లాభాలుంటాయని మీరు అస్సలు ఊహించి ఉండరు

శంఖం విష్ణుమూర్తికి ప్రతీకగా భావిస్తారు కొందరు. అంతటి పవిత్ర స్థానం ఉంది శంఖానికి. చాలా సందర్భాల్లో శంఖాన్ని పూరించి పనులు ప్రారంభిస్తారు. మరి శంఖారావంతో నిజంగా లాభాలున్నాయా? శాస్త్రం ఏం చెబుతోంది?

సాధారణంగా ఏదైనా పని ఆరంభించే ముందు శంఖారావం చేస్తారు. పూజ నుంచి.. యుద్ధం వరకు అన్నీ పనులు శంఖారావంతో మొదలు పెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఈ సంప్రదాయాన్ని అందరూ పాటించడం లేదు. కానీ శంఖారావం అనేది ఎప్పుడూ మంచికి ఆహ్వానానికి ప్రతీకలాంటిది. ఇది దేవతలకు పలికే ఆహ్వానంగా భావించవచ్చు. శంఖానాదం వినిపించగానే ఒక రకమైన ఏకాగ్రత మనసులో వచ్చేస్తుంది. చేస్తున్న పని మీద పూర్తిస్థాయిలో దృష్టి నిలుపగలుగుతాం. అది పూజ కావచ్చు, మరేదైనా కావచ్చు ఒక రకమైన అలెర్ట్ నెస్ తో చేసేందుకు శంఖారావం చక్కని మార్గం.

హిందువులకు శంఖం చాలా పవిత్రమైంది. ఇది కేవలం సముద్రంలో దొరికే గవ్వ మాత్రమే అనుకుంటే అది పొరపాటే. శంఖం స్వచ్ఛతకు, అదృష్టానికి, దైవత్వానికి ప్రతీక. శంఖాన్ని పూరించి పనులు ఆరంభించడం ప్రతీతి. మరి శంఖానాదంతో ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం.

దీర్ఘ శ్వాసతో శంఖాన్ని బలంగా పూరించినపుడు ఓంకార నాదం వినిపిస్తుంది. ఓంకారం అన్ని వేదాలకు ఆది శబ్దం ప్రణవంగా భావిస్తారు. ప్రణవనాదంతో పరిసర ప్రాంతాలు చైతన్యవంతమవుతాయి.

శంఖారావం ప్రసరించిన పరిసరాలు నేరుగా విశ్వశక్తితో అనుసంధానం అవుతాయి. శంఖం పూరించిన వారికి తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. వారికి మాత్రమే కాదు అది విన్న వారు కూడా విశ్వశక్తితో అనుసందానించబడుతారు. అంతటి శక్తిమంతమైంది శంఖ నాదం.

శంఖరావం ప్రతిధ్వనించే చోట కూర్చుని ఆధ్యాత్మిక సాధన చేసేవారి లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి. ఒకసారి శంఖం పూరించి తర్వాత తమ సాధనా పద్దతులను అనురించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

శంఖనాదం తరచుగా వినేవారిలో నెగెటివ్ ఆలోచనలు చాలా తగ్గిపోతాయి. ఫలితంగా జీవితంలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి.

శంఖనాదం వల్ల పరిసరాలు పాజిటివ్ గా మారుతాయి. అలాంటి పరిసరాలు ఆశావహ దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని. ఉత్సాహాన్ని నిలిపి ఉంచుతాయి. అందువల్ల జీవితంలో విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.

శంఖాన్ని పూరించినపుడు మనలను అస్థిర పరిచే రాజస, తమో గుణాలు తొలగిపోతాయి. శంఖనాదం పవిత్రమైన సత్వగుణాలు పెంపొందించేందుకు తోడ్పడే పరిసరాలను సృష్టిస్తుంది.

శంఖాన్ని పూరించినపుడు సుషుమ్న నాడి చురుకుగా మారుతుంది. అగ్ని, వాయుతత్వాలు సంతులనమవుతాయి. కుండలిని రైజింగ్ లో సుషుమ్న నాడీ చురుకుదనానికి ప్రత్యేక స్థానం ఉంది. వెన్నెముక పర్యంతం ఆవరించి ఉండే నాడిగా యోగశాస్త్రం చెబుతోంది.

ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ప్రతిరోజూ శంఖాన్ని పూరించేవారికి కార్డియాక్ బ్లాకేజెస్ ఏర్పడవని చెబుతోంది. శ్వాస వ్యవస్థ కూడా చాలా బలం పుంజుకుంటుంది. ఇది గొంతుకు, ఊపిరితిత్తులకు చక్కని వ్యాయామంగా పనిచేస్తుంది. అందువల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రసారం పెరుగుతుంది. అందువల్ల శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియలు సమర్థవంతంగా సాగుతాయి. మెదడు పని తీరు కూడా మెరుగవుతుంది.

శంఖానాదానికి కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందించే శక్తి ఉంటుంది. కాబట్టి, మీరు కూడా శంఖారావాన్ని పూరించండి.

Also Read : ఇంటి ముఖద్వారం ఇలా ఉంటే లక్ష్మి దేవికి ఆహ్వానం అందినట్టే


శంఖారావం పూరించేది అందుకే, ఇన్ని లాభాలుంటాయని మీరు అస్సలు ఊహించి ఉండరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget