Main entrance door: ఇంటి ముఖద్వారం ఇలా ఉంటే లక్ష్మి దేవికి ఆహ్వానం అందినట్టే
ఇంటి ముఖద్వారం ఆ ఇంటి స్థితి గతులను తెలుపుతుందని అంటుంటారు. వాకిలి చూస్తే ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో అర్థం అవుతుందట. అలాంటి ఇంటి ముఖద్వారం ఎలా పెట్టుకుంటే లక్ష్మీదేవి కి ఆహ్వానం పలుకుతుందో చూద్దాం.
ఇంటి ముఖద్వారాన్ని కేవలం ఎంట్రెన్స్ గా మాత్రమే భావించదు హిందూ సంస్కృతి. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని కమ్యూనిటిల్లో ప్రధాన ద్వారపు గడపను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఇంటి ముఖద్వారం ఇంట్లోకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా ఉండాలని వాస్తు కూడా చెబుతోంది. మరి ముఖద్వారం ఏవిధంగా ఉండాలో తెలుసుకుందాం.
ఎక్కడికి ఏ పని కోసం వెళ్లినా తిరిగి రావల్సింది ఇంటికే. ఇల్లే ఎన్ని మజిలీలు ఉన్నా మన గమ్యంగా ఉంటుంది. అలాంటి ఇంటి ముఖద్వారం అలసిన మన ముఖం మీదకు ఒక చిరునవ్వును, నిశ్చింతను తెచ్చేదిగా ఉండాలి. ముఖద్వారం కేవలం సంపదను ఇచ్చే లక్ష్మీ దేవికి మాత్రమే కాదు అక్కడ నివాసం ఉండే మనకు కూడా ఆహ్వానం పలికే చోటు. ఇంట్లోకి శక్తి ప్రసారానికి స్వాగతం పలికే చోటు. ఇంటి ముఖద్వారం ఇంట్లోకి సమృద్ధిని, సంపదను ఆహ్వానిస్తుంది. ఇంటి ముఖద్వారం ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటే ఇల్లు అంత సంపదను ఆకర్శిస్తుంది.
పవిత్ర చిహ్నాలు
స్వస్తిక్, ఓమ్ వంటి పవిత్ర చిహ్నాలను ఇంటి ముఖద్వారానికి అలంకరించాలి. ఈ పవిత్ర చిహ్నాలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి. ప్రశాంత వాతావరణం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది.
లైట్స్ లేదా దీపాలు
వెలుగు జ్ఞానానికి, సమృద్ధికి ప్రతీక. ఇంటి గడప దగ్గర లైట్లు లేదా దీపం ఉంచడం అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే. చీకటిని పారద్రోలే ఈ చర్య అజ్ఞానాన్ని, అలక్ష్మిని అంతం చేస్తుంది.
శంకం లేదా గంట
ఇంటి ముఖద్వారానికి గంట లేదా శంఖాన్ని అలంకరించాలి. గంట శబ్దం, శంఖం శబ్దం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి.
అద్దం
ఇంటి ముఖ ద్వారం పక్కన ఒక చిన్న అద్దం అమర్చితే చాలా మంచిది. అద్దాలు దేవతలకు స్వాగతం పలుకుతాయి. అంతే కాదు దుష్టశక్తులను దరిచేరనివ్వవు. వాస్తు ప్రకారం సకారాత్మకతను పెంపొందిస్తాయి కూడా.
కలశం
ఒక చిన్న పాత్రలో నీళ్లు నింపి దానిలో కొద్దిగా గులాబి రేకులు వేసి ముఖద్వారం పక్కన ఉంచితే అందంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా. ఒక చిన్న పన్నీరు బుడ్డిలో రోజ్ వాటర్ నింపి ఉంచుకుని ఇంట్లోకి అతిథులు వచ్చిన వెంటనే వారి మీద కాస్త చిలకరిస్తే వారికి మర్యాదగా ఆహ్వానం పలికినట్టు ఉంటుంది.
లక్ష్మీ పాదాలు
పసుపు లేదా కుంకుమతో ఇంటి ముఖద్వారం పక్కగా లక్ష్మీ పాదాలను వేసుకుంటే అందంగా ఉండటమే కాదు, లక్ష్మి ఇంట్లోకి నడచి వచ్చిన భావన కలుగుతుంది. ఈపాదాలు లక్ష్మీ దేవి ఇంట్లోకి నడచి రావడాన్ని సూచిస్తాయి.
Also Read : Vastu tips in telugu: మీ ఇంట్లో ఫ్యామిలీ ఫొటోలు ఎటు వైపు పెడుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.