News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna Janmashtami 2023 : కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడి అడుగులు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి!

కృష్ణాష్టమి రోజు లోగిళ్లలో చిన్ని కృష్ణుడి అడుగులు వేస్తుంటారు. ఇంతకీ అడుగులు ఎలా వేయాలి, ఎందుకు వేయాలి...ఆ అడుగుల వెనుకున్న ఆంతర్యం ఏంటంటే...

FOLLOW US: 
Share:

Krishna Janmashtami 2023 : శ్రీ కృష్ణుడి అడుగులు బయటి నుంచి ఇంట్లోకి వేస్తారు.... ఎందుకంటే...

అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే సూచన

సాధారణంగా భగవంతులంతా, శ్రీ మహావిష్ణువు అవతారాలు, యోగులు, మహర్షులు అందరూ ఉత్తరాయణంలోనే జన్మించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం. దక్షిణాయనం విషయానికొస్తే చీకటికి ప్రతీక. దక్షిణాయణం కర్మకి ఆధారం. పైగా శ్రావణమాసం వర్ష రుతువు అంటే వెన్నెల ఉండదు. వర్ష రుతువులో శుక్ల పక్షం-కృష్ణ పక్షంలో కృష్ణ పక్షం కటిక చీకటిగా ఉంటుంది. ఇలాంటి చీకట్లో అర్థరాత్రి జన్మించాడు శ్రీకృష్ణుడు.పైగా చెరసాలలో..అంటే ఎక్కడ ఉండకూడదో అక్కడ పుట్టాడు.అందుకే దక్షిణాయణం-కృష్ణపక్షంలో చిమ్మ చీకటి మధ్య జన్మించిన కన్నయ్య.. మన జీవితాల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలని..జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ శ్రీ కృష్ణుడి అడుగులను బయటి నుంచి ఇంట్లోకి వేస్తారు

Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!

చీకటిలోంచి వెలుగులోకి నడిపించాలని

గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి. అందుకే తమలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని అడుగులు వేసి లోపలకు ఆహ్వానిస్తారు.

సకల దోషాలు తొలగించాలని

తానే దేవుడిని అని చెప్పినప్పటికీ శ్రీ కృష్ణుడు చతురాశ్రమ ధర్మాలను కూడా పరిపూర్ణంగా పాటించాడు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లోనూ  గురుతత్వాన్ని చూపించిన అవతారం కూడా కృష్ణడొక్కటే. అందుకే కృష్ణడికి ఇంట్లోకి ఆహ్వానం పలకడం ద్వారా సకలదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!

స్నేహితుడిగా వెన్నంటే ఉండాలని 

దేవుడిగా కాదు స్నేహితుడిగా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ  కృష్ణుడి అడుగులు వేస్తారు. ఎందుకంటే కురక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వెన్నంటే ఉండి దోషాల నుంచి విముక్తి కల్పించి విజయాన్ని అందించినట్టే..తాము తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడామని కన్నయ్యను వేడుకుంటారు.

మనిషిలా ప్రవర్తించే నడవడిక నేర్పించమని

కృష్ణుడు వెన్నంటే ఉండి నడిపించాడు కానీ ఎక్కడా నేరుగా రంగంలోకి దిగలేదు. ధర్మం దిశగా మార్గనిర్దేశకత్వం చేశాడు, వేలుపట్టి నడిపించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని, వెళుతున్న మార్గంలో అడ్డంకులు తొలగించమని, మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.

Also Read: పుట్టకముందే శత్రువు సిద్ధం, అడుగుకో కష్టం - కృష్ణుడిని మించి సవాళ్లు ఎదుర్కొన్నదెవరు!

బతుకు నేర్పించమని కోరుతూ

ఎలాగోలా బతికేస్తున్నాం అనుకోవడం వేరు బతకడం వేరు...బతుకు నేర్పమని అడుగుతూనే కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగు వేస్తారు.

సెప్టెంబరు 6 న కృష్ణాష్టమి

పంచాంగకర్తలంతా సెప్టెంబరు 6నే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో. అక్కడి నుంచి వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మర్నాడు ఉదయం. అందుకే శ్రీ కృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండడం ప్రధానం అంటారు. అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 05 Sep 2023 01:46 PM (IST) Tags: krishna janmashtami 2023 krishna janmashtami 2023 date significance of birth of lord sri krishna importance of birth of lord sri krishna Shri Krishna Tatva Drawing Krishnas Feet

ఇవి కూడా చూడండి

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?