Krishna Janmashtami 2023: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు పూజ ఇలా చేయండి!
గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి. అందుకే కృష్ణుడిని దేవుడిగా మాత్రమే కాదు గురువుగా కూడా భావించి పూజలందిస్తారు...
Krishna Janmashtami 2023: 2023లో సెప్టెంబరు 6, 7 తేదీల్లో కృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటున్నారు. కృష్ణుడు జన్మించిన సమయం అష్టమి ఉండాలన్న ఉద్దేశంతో ఆరో తేదీన కొందరు జరుపుకుంటే... ఏడో తేదీ మొత్తం అష్టమి, రోహిణి నక్షత్రం ఉండండతో ఏడో తేదీ కొందరు జరుపుకుంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం, శ్రీ కృష్ణుడు కృష్ణ పక్షంలోని అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీకృష్ణుడిని మురళీధర, కన్హ, శ్రీకృష్ణ, గోపాల, మురుళీ మనోహర, గోపీ మనోహర, శ్యామ్, గోవింద, మురారి, ముకుంద, రంగ...ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం, ఆయనకు సంబంధించిన మంత్రాలను పఠించడం వల్ల ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు స్మార్త సంప్రదాయానికి, రెండో రోజు వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఈ ఏడాది సెప్టెంబర్ 7న జరుపుకుంటున్నారు.
Also Read: ద్వారక సముద్రంలో మునిగినప్పుడు మిస్సైన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు ఎక్కడుందంటే!
కృష్ణ జన్మాష్టమి పూజా విధానం
శుభ్రం చేసిన పీటపై ఎర్రటి గుడ్డను పరచి, ఒక ప్లేట్‌లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచండి. తర్వాత దీపం, ధూపం వెలిగించి దేవుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత పంచామృతాలతో దేవుడికి అభిషేకం చేయాలి. తర్వాత గంగాజలంతో స్నానం చేయాలి. ఆ తర్వాత శ్రీ కృష్ణుడికి నూతన వస్త్రాలు ధరించి, అలంకరించి, ఆపై మరోసారి దీప-ధూప దీపం వెలిగించాలి. ఆ తర్వాత దేవుడికి అష్టగంధ, చందనం, అక్షత తిలకం పెట్టాలి. దేవుడికి వెన్న, పంచదార, పంచాద్య నైవేద్యాలు సమర్పించండి. శ్రీకృష్ణుని పూజించేటప్పుడు తులసి మరియు గంగాజలాన్ని సమర్పించండి.
కృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడిని ఎలా ధ్యానించాలి
శ్రీకృష్ణుడు బాల గోపాలుడి రూపంలో రావి ఆకుపై నిద్రిస్తుంటాడు. కృష్ణుడు అంటే ఆకర్షణ. కృష్ణుడు అంటే పారవశ్యం లేదా సంపూర్ణ మోక్షం.
ఆ విధంగా శ్రీకృష్ణుడు అంటే పారవశ్యం లేదా సంపూర్ణ మోక్షం వైపు ఆకర్షించేవాడు. ఈ విధంగా బాల కృష్ణుని రూపాన్ని పూజిస్తూ, ఆయనకు నమస్కారాలు చేయండి. కృష్ణుడికి నమస్కరించి చివర్లో చేతిలో అక్షతలు, పుష్పం పట్టుకుని, దానిపై నీళ్లు వదిలి శ్రీకృష్ణుడికి సమర్పించాలి.
కృష్ణ జన్మాష్టమి మంత్రం
'క్రుం కృష్ణాయ నమః'
'ఓం శ్రీం నమః శ్రీ కృష్ణాయ పరిపూర్ణ తమాయ స్వాహా'
'గోకులనాథాయ నమః'
'గోవల్లభాయ స్వాహా'
'ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీం'.
Also Read: ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలంటే కృష్ణతత్వం అర్థంచేసుకోవాలి!
శ్రీకృష్ణుడు మంత్రాలు
- ఓం దేవకీ నందాయ విద్మయే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్
- హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే...
- జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర్ భక్త బృందా
- శ్రీ కృష్ణ గోవింద హరే మురారి హే నాథ్ నారాయణ వాసుదేవ
- ఓం క్లీం కృష్ణాయ నమః
- ఓం శ్రీ కృష్ణం శరణం మం
- ఓం కృష్ణాయ నమః
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పైన పేర్కొన్న విధంగా శ్రీకృష్ణుని పూజిస్తే మీ జీవితంలోని అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. ఇది మీకు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.