గరుఢ పురాణం: ఈ పనులు చేసేవారు, వచ్చే జన్మలో ఇలా పుడతారట!
ప్రస్తుతం మనం తీసుకున్న ఈ జన్మ మన కర్మానుసారం మనకు లభించిందే. ఇప్పుడు సంపాదించుకుంటున్న సంచిత కర్మ రాబోయే జన్మను నిర్ణయిస్తుంది. గరుఢ పురాణాన్ని ద్వారా వ్యక్తి భవిష్యత్తు అతడి కర్మను బట్టి ఉంటుంది.
ఈ జన్మ కర్మను అనుసరించి మరో జన్మ ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మరణం తర్వాత మరో జన్మ ఏదో ఒక రూపంలో జరుగుతుంది. పునర్జన్మ ఏ రూపంలో ఉండాలనేది కర్మను అనుసరించి పాటికే నిర్ణయించబడి ఉంటుందనేది పురాణాల సారం. అందుకు దేవుడు చేసేదానికంటే కూడా మీ కర్మలే మీ పునర్జన్మకి రూపాన్ని ఇస్తాయనేది దీని సారాంశం.
ప్రస్తుతం మనం తీసుకున్న ఈ జన్మ మన కర్మానుసారం మనకు లభించిందే. అదేవిధంగా ఇప్పుడు సంపాదించుకుంటున్న సంచిత కర్మ రాబోయే జన్మను నిర్ణయిస్తుంది. గరుఢ పురాణాన్ని అనుసరించి ప్రతి వ్యక్తి భవిష్యత్తు అతడి మంచి చెడుల మీదే ఆధారపడి ఉంటుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం జనన మరణాల చక్రబ్రమణాన్ని ప్రతి ఒక్కరూ దాటాల్సి ఉంటుంది. అందుకే పుట్టిన ప్రతి ఒక్కరికి మరణించి తీరాలి. మరణం ఖాయం అనేది మారని సత్యం. అయితే మరణించిన ప్రతి వారు తప్పని సరిగా వారి కర్మానుసారం మరోజన్మ కూడా తీసుకోవాల్సి ఉంటుందనేది కూడా మార్చలేని సత్యమే.
మరణం తర్వాత శరీరం నశిస్తుంది. పాత శరీరాన్ని విడిచిన ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. గరుఢ పురాణంలో మొత్ 84 లక్షల జాతుల ప్రస్తావన ఉంటుంది. ఇందులో మానవ శరీరం ఉత్తమమైందిగా పరిగణించబడింది. మరణం తర్వాత మీరు ఏ యోని ద్వారా జన్మించాలో ఈ జన్మలోనే నిర్ణయించబడుతుంది. ఈ జీవితంలో మీరు చేసే ఐదు కర్మలు మీ తర్వాత జన్మను నిర్ణయం చేస్తాయి. అటువంటి ఐదు కర్మల గురించి తెలుసుకుందాం.
స్వీయ ధర్మాన్ని అవమానించేవారు
ధర్మం, వేద పురాణాల వంటి పవిత్ర గ్రంథాలను అవమానించే వ్యక్తి, భగవంతుడి పట్ల భక్తి లేనివాడు, పూజించడం మీద నమ్మకం లేనివాడిని నాస్తికుడు అంటారు. గరుఢ పురాణం ప్రకారం అలాంటి వారి తదుపరి జన్మలో కుక్కగా జన్మిస్తారు.
నమ్మక ద్రోహి
స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత అందమైన అనుబంధం. కానీ కొంత మంది స్నేహితులు శత్రువులుగా మిగిలి పోతారు. గరుఢ పురాణం ప్రకారం మిత్రులుగా నటిస్తూ స్నేహితులను మోసం చేసే వారు తర్వాత జన్మలో రాబందులుగా పుడతారు.
మోసం చేసే వారు
కొంత మంది అతితెలివితో ఉంటారు ఇతరులను తమ మాటలతో, తెలివి తేటలతో ఇతరులను మోసం చేస్తుంటారు. ఇలా ఇతరులను మోసం చేసి లాభపడేవారికి మరణానంతరం నరకం ప్రాప్తిస్తుంది. వీరికి గుడ్ల గూబగా పునర్జన్మ లభిస్తుంది.
దుర్భాషలాడేవారు
మనిషి వాక్కు సరస్వతి నిలయం. మాటలో మాధుర్యం లేని వాళ్లు ఎదుటివారి గురించి చెడు మాటలు మాట్లాడే వారు, ఇతరుల గురించి పితూరీలు చెప్పేవారు, చాడీలు చెప్పే వారు మేకరూపంలో పునర్జన్మిస్తారని గరుఢ పురాణం చెబుతోంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: కుల దైవాన్ని విస్మరిస్తే కష్టాలు తప్పవా? శాస్త్రం ఏం చెబుతోంది?