అన్వేషించండి

Karthika Amavasya 2024 Date: కార్తీక అమావాస్య శనివారమా - ఆదివారమా? కార్తీకమాసం చివరి రోజు పూజా విధానం!

Karthika Amavasya 2024 : అమావాస్యతో కార్తీకమాసం అయిపోయింది. అయితే ఈ ఏడాది కార్తీక అమావాస్య తగులు-మిగులు రావడంతో ఏ రోజు అమావాస్య అనే కన్ఫ్యూజన్ నెలకొంది...ఈ రోజు ఏ పూజ చేయాలంటే...

 karthika Amavasya 2024 Date And Time :  శని, రాహు కేతు దోషాలతో పాటూ పితృ దోషాల నుంచి విముక్తి పొందేందుకు అమావాస్యను శుభప్రదంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో శని ఉందో వారు అమావాస్య రోజు శనిని ఆరాధించి , అభిషేకం నిర్వహించి..దాన ధర్మాలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతారు. 

అమావాస్యతో కార్తీకమాసం ముగిసి..ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటూ నదుల్లో, చెరువుల్లో , బావుల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేసుకునేవారు ఈ రోజు కూడా నదీ, సముద్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తారు. అమావాస్య రోజు పెట్టే దీపాలతో కార్తీకం నెలరోజులు చేసిన పుణ్యానికి పూర్ణఫలం లభిస్తుంది. అమావాస్య తర్వాత మార్గశిరమాసం మొదటిరోజైన పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు..ఈ రోజు వెలిగించే దీపాలతో కార్తీకమాసం స్వస్తి.  

Also Read:  కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!

అయితే ఈ ఏడాది అమావాస్య ఎప్పుడొచ్చిందన్నది కొంత గందరగోళం ఉంది. కార్తీక అమావాస్య నవంబరు 30 శనివారం ఉదయం 9 గంటల 37 నిముషాల నుంచి డిసెంబరు 01 ఆదివారం ఉదయం 10 గంటల 11 నిముషాల వరకూ ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో రెండు మూడు నిముషాలు వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటే అమావాస్య ఆదివారం వచ్చింది. అపరాన్న సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే అమావాస్య శనివారం వచ్చింది. అంటే కార్తీక స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించాలి అనుకుంటే ఆదివారం... పితృదేవతలను ఆరాధించేందుకు , తర్పణాలు విడిచేందుకు శనివారం పరిగణలోకి తీసుకోవాలి.  

కార్తీక అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించాలి. తర్పణాలు విడిచేవారు మధ్యాహ్న సమయంలో పితృదేవతలను స్మరించుకుని బాహ్మణుడికి స్వయంపాకం, దక్షిణ తాంబూలం సమర్పించాలి. ఈ రోజు సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం మంచిది. 

సాధారణంగా అమావాస్యను ఉపవాస తిథి అంటారు..ఈ రోజు చేసే ఉపవాసం పెద్దలకు దక్కుతుంది. పైగా కార్తీకమాసం మొత్తం ఉపవాస నియమాలు పాటించేవారు ఈ రోజంతా ఉపవాసం ఉంటే నెల రోజుల ఫలితం సంపూర్ణంగా సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. అమావాస్య రోజు సూర్యాస్తమయం సమయంలో ద్వారం దగ్గర దీపాలు వెలిగించాలి. ఇంట్లో దేవుడి మందిరంలో దీపారాధన చేసి విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. 

Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!

చీమలకు పంచదార వేయడం, బెల్లం - నువ్వులు-నల్లటి వస్త్రాలు దానం చేయడం- గోమాతకు సేవచేయడం, రావిచెట్టు దగ్గర దీపం వెలిగించడం, హనుమాన్ చాలీశా పఠించడం ద్వారా శనిదోషం తొలగిపోతుంది. మరోవైపు అమావాస్య రోజు ఉపవాసం ఉంటే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.

శని శాంతి మంత్రం 

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

ఈ శ్లోకాన్ని 11 సార్లు పఠించిన తర్వాత ఈ కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!

ABP దేశంలో మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dil Raju IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు- దిల్ రాజు సహా నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై ఆకస్మిక దాడులు
Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
తైవాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు- సీసీటీవీ వీడియో వైరల్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
Embed widget