అన్వేషించండి

International Yoga Day 2025 : సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం - 12 మంది సూర్యులు 12 ఆసనాలు వాటి విశిష్ఠత!

Surya Namaskar: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమైనది. వివిధ రకాల ఆసనాలు, శ్వాసక్రియ అభ్యాసాలు, ధ్యాన ముద్రలు , సూర్యనమస్కారాలు ఇవన్నీ యోగాలో భాగమే..వీటిలో సూర్య నమస్కారాలు ప్రత్యేకం

International Yoga Day 2025: ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది సూర్యులు.. ద్వాదశ ఆసనాలు..అవే సూర్య నమస్కారాలు. సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి సరిపోతాయి. ఎందుకంటే.. లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. నిత్యం సూర్యారాధన చేసేవారికి ఆరోగ్యం, మనోవికాసం సిద్ధిస్తుంది. 

భగవంతుడి ప్రార్థన ప్రారంభించేది సూర్యారాధనతోనే

అగస్త్య మహర్షి సూచన మేరకు ఆదిత్య హృదయం పఠించి రావణుడితో యుద్ధంలో విజయం సాధించాడు రామచంద్రుడు

సమస్త విశ్వంలో ఉండే చీకట్లు చీల్చి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడు నవగ్రహాలు రాజు..అందుకే సూర్యారాధన చేసేవారిపై గ్రహాల ప్రతికూల ప్రభావం ఉండదని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
 
ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం, 
సాయంకాలే స్వయం విష్ణుః, త్రిముర్తిస్తూ దివాకరః 

ఉదయం బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపుతాడు
మధ్యాహ్నం కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలు తొలగించి ఉత్సాహాన్ని నింపుతాడు
సాయంత్రం విష్ణు స్వరూపుడిగా కిరణాల ద్వారా ఆనందాన్నిస్తాడు

సూర్య భగవానుడు 12 రూపాల్లో దర్శనమిస్తాడు.. అవే ధాతా, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణు. నెలకో పేరుతో 12 నెలల్లో సంచరిస్తాడు ఆధిత్యుడు. ఈ 12 పేర్లు స్మరిస్తే చాలు దీర్ఘకాల వ్యాధులు నయం అవుతాయని భవిష్య పురాణంలో ఉంది.  

12 మంది సూర్యులకు గుర్తుగా 12 ఆసనాలు చెబుతారు..అవే సూర్య నమస్కారాలు. 
 
కుడి ఎడమల వ్యత్యాసం మినహాయిస్తే 12 ఆసనాల్లో  1 నుంచి 5 , 8 నుంచి 12 ఒకేలా ఉంటాయి...అయితే ప్రతి ఆసనానికి ఓ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. 

సూర్య నమస్కారాల్లో వేసే ఆసనాల వల్ల  శ్వాస కోశ వ్యవస్థ మెరుగుపడుతుంది

మెడ , భుజాలు, వెన్నెముక దగ్గర  కండరాలు దృఢంగా మారుతాయి

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, వెన్నుముక బలోపేతం అవుతుంది

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కాలి కండరాలు బలోపేతం అవుతాయి

వెన్నుముక, చేతి మణికట్టు కండరాలు దృఢంగా మారుతాయి

గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఆపుతాయి

బరువు తగ్గుతారు, మానసిక ఒత్తిడి మాయమవుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు

దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

12 ఆసనాలు వేసేటప్పుడు ద్వాదశ ఆదిత్యులను స్మరించుకోవాలి
 
నమస్కారాసనం (ఓం మిత్రాయ నమః) - సూర్యుడికి ఎదురుగా నిల్చుని నమస్కారం చేయాలి 

హస్త ఉత్తానాసనం (ఓం రవయే నమః) - నమస్కారం చేసిన రెండు చేతులను అలాగే పైకెత్తి, తల నడుము వెనుకకు వంచాలి 

పాదహస్తాసనం  (ఓం సూర్యాయ నమః) - శ్వాసను నెమ్మదిగా వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమి మీద ఆన్చి తలను మోకాలుకు తగిలేలా  ఉంచాలి

ఆంజనేయాసనం (ఓం భానవే నమః) - ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతులు పైకెత్తి నడుము భాగాన్ని వెనక్కు వంచాలి  

పర్వతాసనం (ఓంఖగాయ నమః) - కాళ్ళు, చేతులు నేల మీద ఉంచి నడుము పైకి ఎత్తి శ్వాస నెమ్మదిగా వదలి తిరిగి పీల్చాలి 

 సాష్టాంగ నమస్కారం  (ఓం పూష్ణే నమః) - నేలపై పడుకుని నడుము భాగాన్ని కొద్దిగా పైకి లేపి శ్వాసను పూర్తిగా బయటకు వదలాలి
 
సర్పాసనం (ఓం హిరణ్యగర్భాయ నమః) - శ్వాసను పీల్చి తలను వెనుక్కు వంచాలి 

పర్వతాసనం (ఓం మరీచయే నమః)- కాళ్ళు చేతులు నేలమీద ఉంచి నడుమును పైకెత్తి శ్వాస వదిలి పీల్చాలి
 
ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) - కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆన్చి రెండు చేతులు, తల, నడుము వెనక్కు వంచాలి
 
పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) - చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఉంచి తల మోకాలుకి తగిలేలా ముందుకి వంగాలి
 
హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయ నమః) - రెండు చేతులు పైకెత్తి  తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి 

నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) -  నమస్కారం చేయాలి

ఈ 12 ఆసనాలు వేసేటప్పుడు శ్వాసపై ధ్యాసతో పాటూ ప్రార్థనను కూడా జోడిస్తే శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయని చెబుతారు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget