అన్వేషించండి

Money Tips in Astrology: చేతిలో డబ్బు నిలవడం లేదా , ఆర్థికంగా బలపడాలి అనుకుంటున్నారా .. జ్యోతిష్య శాస్త్రం చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవండి!

Money Tips in Astrology: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నప్పుడు వాటి నుంచి బయటపడేందుకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు..అవేంటంటే..

Astrology Remedies For Money

అనుకోని ఖర్చులు వెంటాడుతున్నాయా?

ఎంత సంపాదించినా చేతిలో పైసా నిలవడం లేదా?

ఎలాంటి లోనట్టే కనిపిస్తున్నా సమయానికి చేతిలో డబ్బు ఉండడం లేదా?

ఆదాయం పెరుగుతున్నా కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదరువుతోందా?

ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారా?

ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకునేవారికోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు...అవేంటంటే..
 
మంగళవారం నియమం

ఎవర్ని కదిలించినా సంతోషంగా ఉన్నాం అనేకన్నా ఏదో ఉన్నాంలే అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. ఆ భారం దించుకునేందు ఆధ్యాత్మిక వేత్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన నియమాల్లో మొదటిది మంగళవారం నియమం. మంగళవారం ఏ పని చేసినా మళ్లీ చేస్తారని చెబుతారు. చాలామందికి ఈ నమ్మకం ఉంది కూడా. అందుకే మీకు అప్పులేమైనా ఉంటే మంగళవారం రోజు ఎంతో కొంత తీర్చాలని సూచిస్తున్నారు. ఓ మంగళవారం అప్పు తీరిస్తే త్వరలోనే అప్పుల ఊబినుంచి బయటపడతారని చెబుతున్నారు. ఓ మంగళవారం అప్పులు తీర్చేస్తే ఆ తర్వాత ఏదో ఒకరకంగా మీచేతికి డబ్బు చేరుతుందట. మీరు ఊహించనంత త్వరగా అప్పు తీర్చేయగలుగుతారు. ఇది కేవలం మంగళవారానికి మాత్రమే ప్రత్యేకత అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ సెంటిమెంట్ కొత్తగా మొదలైనదేం కాదు పూర్వకాలం నుంచి కొనసాగుతోందట. ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు తీర్చుకుంటూ వెళితే క్రమంగా అప్పులు ఐస్ క్రీమ్ లా కరిగిపోతాయట. అయితే మంగళవారం అప్పులు తీర్చండి కానీ ఎవరికీ అప్పులు ఇవ్వకండి.  

శుక్రవార నిమయం

శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజు తలకు సాధారణ స్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోరాదు. ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం రోజు తల రుద్దుకోకూడదు. ప్రతిశుక్రవారం ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని, లక్ష్మీకటాక్షం ఉంటుందని చెబుతారు. చేతికి బంగారం గాజులు లేదంటే మట్టిగాజులు వేసుకోవాలి కానీ ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా వివాహితులు ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. 

జుట్టు విరబోసుకుని తిరగొద్దు

జుట్టు విరబోసుకుని తిరగడం అంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే. అందుకే ఎప్పుడూ జుట్టు విరబోసుకుని తిరగకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజు జుట్టు విరబోసుకోవడం, పేలు చూసుకోవడం అంటే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నట్టే.. లక్ష్మీదేవిని సాగనంపుతున్నట్టే. 

శుక్రవారం రోజు ఇవి ఇవ్వకండి
 
పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు..వీటిని లక్ష్మీదేవికి చిహ్నాలుగా భావిస్తారు. అందుకే శుక్రవారం రోజు వీటిని ఎవరికీ ఇవ్వకూడదని చెబుతారు. 

అబద్ధాలు చెప్పొద్దు

గృహిణి లక్ష్మీదేవితో సమానం..అందుకే గృహలక్ష్మి అంటారు. ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ అశుభం పలకకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి

గమనిక: జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక పుస్తకాల్లో పొందుపరిచిన వివరాలు ఆధారంగా రాసిన కథనం. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

 Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

10-10-2026 శనివారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం ఎలా?
10-10-2026 శనివారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం ఎలా?
10-10-2026 శనివారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: అహంకారం, అతివిశ్వాసం తగ్గించుకోవాల్సిందే!
10-10-2026 శనివారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: అహంకారం, అతివిశ్వాసం తగ్గించుకోవాల్సిందే!
10-10-2026 శనివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆర్థికం, ఆరోగ్యం - మీ భవిష్యత్తు!
10-10-2026 శనివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆర్థికం, ఆరోగ్యం - మీ భవిష్యత్తు!
10-10-2026 శనివారం మేషం, వృషభం, మిథున రాశులవారి జీవితం ఎలా మారబోతుంది?
10-10-2026 శనివారం మేషం, వృషభం, మిథున రాశులవారి జీవితం ఎలా మారబోతుంది?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget