అన్వేషించండి

kamakshi Deepam: కామాక్షీ దీపం విశిష్టత ఏంటి - ఈ దీపం ఏ సందర్భాల్లో వెలిగిస్తారు!

సంప్రదాయాన్ని పాటించే ప్రతి హిందువు ఇంట్లోనూ నిత్యం దీపారాధన చేస్తారు. అయితే దీపారాధనలో చాలా రకాలున్నాయి. ఉప్పుతో వెలిగిస్తే ఐశ్వర్యదీపం అంటారు. మరి కామాక్షి దీపం గురించి తెలుసా..

దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే

దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా  ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం ఎల్లప్పుడూ కూడా మట్టి ప్రమిదలో వెలిగించాలి. వీటిలో రకాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే కామాక్షి దీపం. కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీదేవి చిత్రం ఉంటుంది. అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అనికూడా అంటారు. దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది. 

Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!

కామాక్షీ దేవి ఎవరు

సర్వదేవతలకూ శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే అన్ని ఆలయాల కన్నా ముందుగా  కామాక్షీ దేవి ఆలయాన్ని తెరిచి రాత్రి అన్ని ఆలయాలు మూసేసిన తర్వాత తలుపులు వేస్తారు. అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది.  అన్ని గుళ్లు మూసేసిన తర్వాత  ఈ అమ్మవారు పవళింపుసేవ ఉంటుందని చెబుతారు. సర్వశక్తి సంపన్నురాలైన కామాక్షీదీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుందని చెబుతారు. 

అఖండ దీపంగా చాలామంది ఇదే వెలిగిస్తారు

చాలామంది ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడు అఖండ దీపం వెలిగిస్తారు. ఆ సమయంలో చాలామంది కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది. ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం మరియు పండితులు చెబుతున్నారు. సాధారణంగా దేవుడి ముందు దీపారాధన చేసినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టడం ఆచారం.  కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. పౌర్ణమిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచి శుభప్రదం అని విశ్వసిస్తారు. 

Also Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!

కామాక్షి దేవి దీపంగా దక్షిణాదిలోని తమిళనాడు వారు ప్రసిద్ధిగా ఈ ఆచారాన్ని పాటిస్తారు . ఇతర తెలుగు , కర్ణాటక రాష్ట్రాలలో ఈ దీపాన్ని లక్ష్మీ దీపంగా, గజలక్ష్మీ దీపంగా పిలుస్తూ ఉంటారు .  ఎలా పిలిచినా ఈ దీపం మాత్రం అనంతమైన జ్ఞానసిద్ధిని , ఐశ్వర్యాయాన్ని అనుగ్రహిస్తుందని విశ్వాసం . 

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే” 

“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక  మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. 

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
వృషభ రాశి వారఫలాలు: ఆగస్టు 9-15 - కష్టం, ఆర్థిక నష్టం - సంబంధాల విషయాలలో సహనం అవసరం!
వృషభ రాశి వారఫలాలు: ఆగస్టు 9-15 - కష్టం, ఆర్థిక నష్టం - సంబంధాల విషయాలలో సహనం అవసరం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget