Image Credit: Pinterest
Spirituality: అష్ట అంటే ఎనిమిది... అష్టాదశ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది... మనం పూజించే లక్ష్ములు ఎనిమిదుగురు... అందుకే అష్ట లక్ష్మి అంటారు. ఇంకా అష్టాదశ పీఠాలు , అష్టా దశ పురాణాలు, అయ్యప్ప స్వామి గుడి మెట్లు, అష్టదిక్పాలకులు, అష్టమూర్తులు, అష్టఐశ్వర్యాలు, అష్టకష్టాలు...ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా చాలా ఉన్నాయి...
అష్ట లక్ష్మిలు
1.ఆది లక్ష్మి, 2. ధాన్యలక్ష్మి
3. ధైర్యలక్ష్మి , 4.గజలక్ష్మి
5.సంతానలక్ష్మి, 6. విజయలక్ష్మి
7.విద్యాలక్ష్మి, 8.ధనలక్ష్మి
అష్టాదశ పీఠాలు
1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక ), 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్) 4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్), 6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర), 8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ ) ,10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా), 12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం), 14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్), 16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్), 18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
Also Read: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
అష్టా దశ పురాణాలు
1. బ్రహ్మపురాణం, 2. పద్మపురాణం, 3. నారద పురాణం
4. మార్కండేయపురాణం, 5. విష్ణుపురాణం, 6. శివపురాణం
7. భాగవతపురాణం, 8. అగ్నిపురాణం, 9. భవిష్యపురాణం
10. బ్రహ్మవైవర్త పురాణం, 11. లింగపురాణం, 12. వరాహపురాణం
13. స్కందపురాణం, 14. వామనపురాణం, 15. కుర్మపురాణం
16. మత్స్యపురాణం, 17. గరుడపురాణం, 18. బ్రహ్మాండపురాణం
అయ్యప్ప స్వామి గుడి మెట్లు
1. పొన్నంబలమేడు, 2. గౌదేంమల, 3. నాగమల
4. సుందరమల, 5. చిత్తంబలమల, 6. ఖల్గిమల
7. మాతంగమల, 8. మైలదుమల, 9. శ్రీపదమల
10. దేవరమల, 11. నిలక్కలమల, 12. తలప్పరమల
13. నీలిమల, 14. కరిమల, 15. పుతుసేరిమల
16. కలకేట్టిమల, 17. ఇంచిప్పరమల, 18. శబరిమల
అష్టదిక్పాలకులు
1. తూర్పు (ఇంద్రుడు), 2. ఆగ్నేయం (అగ్ని)
3. దక్షిణం (యముడు), 4. నైరుతి (నిరుతి)
5. పశ్చిమం (వరుణుడు), 6. వాయువ్యం (వాయువు)
7. ఉత్తరం (కుబేరుడు),8. ఈశాన్యం (ఈశానుడు)
Also Read: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
అష్టమూర్తులు
1. భూమి, 2. ఆకాశం, 3. వాయువు, 4. జలము, 5. అగ్ని, 6. సూర్యుడు, 7. చంద్రుడు, 8. యజ్గ్యము చేసిన పురుషుడు.
అష్టఐశ్వర్యాలు
1. ధనము, 2. ధాన్యము, 3. వాహనాలు, 4. బంధువులు, 5. మిత్రులు, 6. బృత్యులు, 7. పుత్రసంతానం, 8. దాసిజనపరివారము
అష్టకష్టాలు
1. అప్పు, 2. యాచన, 3. ముసలితనం, 4. వ్యభిచారం, 5. చోరత్వం, 6. దారిద్యం, 7. రోగం, 8. ఎంగిలి భోజనం
అష్టఆవరణాలు
1. విభూది, 2. రుద్రాక్ష, 3. మంత్రము, 4. గురువు, 5. లింగము, 6. జంగమ మాహేశ్వరుడు, 7. తీర్థము, 8. ప్రసాదము
అష్టవిధ వివాహములు
1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. ఆసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. ఫైశాచం
అష్టభోగాలు
1. గంధం – 2. తాంబూలం – 3. పుష్పం – 4. భోజనం – 5. వస్త్రం – 6. సతి – 7. స్నానం – 8. సంయోగం
అష్టాంగ యోగములు
1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. ద్యానము, 8. సమాధి
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ తప్పులు చేస్తే వాస్తు దోషాలు తప్పవు!
Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!
Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!
Ancestors In Dream: పితృపక్షం సమయంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!
Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
/body>