అన్వేషించండి

Hyderabad To Tiruvannamalai: హైదరాబాద్ to అరుణాచలం ఈజీగా వెళ్లేందుకు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో తెలుసా!

Hyderabad To Arunachalam : హైదరాబాద్ to అరుణాచలం ఏ మార్గంలో వెళితే ఈజీగా చేరుకోవచ్చు, ఏ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది? ఎలా వెళితే తక్కువ ఖర్చు అవుతుంది.. పూర్తి వివరాలు తెలుసుకోండి

Tiruvannamalai: తమిళనాడులో ఉన్న ప్రధాన క్షేత్రాల్లో ఒకటి అరుణాచలం. నిత్యం భక్తులతో కళకళలాడే తిరువణ్ణామలై పౌర్ణమి రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది. గిరిప్రదక్షిణలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అరుణాచలం వెళుతుంటారు. ఇందుకోసం RTC తో పాటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు ప్రకటిస్తుంటాయి. అయితే హైదరాబాద్ టు అరుణాచలం ఏ మార్గంలో వెళ్లడం మంచిది. ఏది సౌకర్యం, ఏది తక్కువ ఖర్చుతో అయిపోతుంది.. పూర్తి వివరాలు ఇవే... 

హైదరాబాద్‌ నుంచి అరుణాచలం వెళ్లాలి అనుకుంటే వివిధ మార్గాలున్నాయి. 

Hyderabad to Tiruvannamalai By Air

ప్రయాణ సమయం తక్కువగా ఉండాలంటే విమానంలో వెళ్లడం మంచిది. అరుణాచలంలో విమానాశ్రయం లేదు కానీ సమీపంలో  చెన్నై , బెంగళూరులో ఉన్నాయి. 
హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ జర్నీ 1 గంట 20 నిమిషాలు. టికెట్ ధర 2 వేలు నుంచి 7 వేలు ఉంటుంది..మీకు బుక్ చేసుకున్న టైమ్ ఆధారంగా. 
హైదరాబాద్ - చెన్నై మధ్య తిరిగే విమానాలు... ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ 
 చెన్నై నుంచి తిరువణ్ణామలై కి రోడ్డు ద్వారా వెళితే 195 కిలోమీటర్లు నాలుగైదు గంటల్లో చేరుకోవచ్చు.  టాక్సీల్లో వెళితే ఓవైపు ఛార్జీలు 3 వేల నుంచి 5 వేలు ఉంటాయి. 
చెన్నై నుంచి తిరువణ్ణామలైకి రైలు ప్రయాణం  4 గంటలు పడుతుంది
ఇక బెంగళూరు నుంచి  అరుణాచలానికి రోడ్డు మార్గంలో వెళితే నాలుగైదు గంటలు సయమం పడుతుంది. ట్యాక్సీల ధర 3 వేల నుంచి 6 వేలు ఉంటుంది. బెంగళూరు నుంచి బస్సులు కూడా ఉంటాయి. 
విమాన మార్గంలో వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి వెళ్లడం కన్నా చెన్నై మీదుగా వెళ్లడం మంచిది

Hyderabad to Tiruvannamalai By Train
 
ఖర్చు తక్కువ, సౌకర్యం ఎక్కువ కోరుకునేవారు హైదరాబాద్ నుంచి అరుణా చలం ట్రైన్లో వెళ్లడం బెటర్.  హైదరాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ కి చేరుకునేందుకు సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లేందుకు రెండు మూడు గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో చెన్నై లేదా బెంగళూరు చేరుకున్నా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరుణాచలం చేరుకోవచ్చు.  బెస్ట్ ట్రైన్ రూట్ అంటే మాత్రం... హైదరాబాద్ నుంచి కాట్పాడి చేరుకుని తిరువణ్ణామలై వెళ్లడమే బెటర్.  

Hyderabad to Tiruvannamalai By Bus

హైదరాబాద్ నుంచి తిరువణ్ణామలై వెళ్లే భక్తులకు ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయినే నేరుగా అరుణాచలం వెళ్లొచ్చు లేదంటే బ్రేక్ జర్నీ చేయొచ్చు. ఈ రెండు ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయ్. నాన్ ఎసీ, ఎసీ, స్లీపర్, సెమీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరులో ఉన్న క్షేత్రాలు కవర్ చేస్తూ అరుణాచలం చేరుకోవచ్చు. 10 నుంచి 12 గంటలు పట్టే ఈ ప్రయాణానికి టికెట్ ధర 1200 నుంచి 2500. చెన్నై లేదా బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్లాలి అనుకుంటే నాలుగైదు గంటల సమయం పడుతుంది.. బస్ టికెట్ ధర 300 నుంచి 600 

Hyderabad to Tiruvannamalai Long Road Trip 

ఈ మూడు కాకుండా లాంగ్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేసుకుంటే... హైదరాబాద్ నుంచి అరుణాచలం దాదాపు 705 కిలోమీటర్లు. హైదరాబాద్ లో బయలుదేరి కర్నూలు, కడప, చిత్తూరు మీదుగా తిరువణ్ణామలై వెళ్లేందుకు 12 నుంచు 14 గంటల సమయం పడుతుంది. పెట్రోలుకి అయ్యే ఖర్చు సుమారుగా 5 వేల నుంచి 7 వేలు...

 మీరు కేటాయించే సమయం, బడ్జెట్ ఆధారంగా మీ మార్గాన్ని ఎంపిక చేసుకోండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Embed widget