అన్వేషించండి

Guru Purnima 2025: గురువుల అనుగ్రహం కోసం ఎదురుచూపు! ఈ శ్లోకాలతో మీ గురువులకు శుభాకాంక్షలు చెప్పండి!

Guru Purnima Wishes In Telugu 2025: ఇవాళ (జూలై 10) ఆషాఢ పూర్ణిమ ఇదే రోజు గురు పౌర్ణమి. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించిన గురుదేవులను స్మరించుకునే రోజు.. ఈ శ్లోకాలతో వారిని స్మరించుకోండి

Guru Purnima Wishes 2025 : గురు పరంపరకు అలవాలం భారతదేశం. పూర్వకాలంలో గురుకుల విద్యా విధానం ఉండే సమయంలో  గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులను కన్న బిడ్డలకన్నా ఎక్కువ ప్రేమించేవారు.  విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో తమవంతు సంపూర్ణ ప్రయత్నం చేసేవారు. 

ఆదియోగి అయిన ఈశ్వరుడు సప్త రుషులకు జ్ఞానబోధ చేసింది గురు పౌర్ణమి రోజే 

తన శిష్యులకు దత్తాత్రేయుడు జ్ఞానబోధ ప్రారంభించిన రోజు గురు పౌర్ణమి

మత్స్యకన్య అయిన సత్యవతికి - పరాశరమహర్షికి వ్యాసభగవానుడు జన్మించిన రోజు గురు పౌర్ణమి

వేదాలను.. బుగ్వేదం, సమావేదం, అధర్వణవేదం, యజుర్వేదం  అని 4 భాగాలుగా వ్యాసమహర్షి విభజించిన రోజు గురు పౌర్ణమి

మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు ఇవన్నీ అందించిన వ్యాసమహర్షి జన్మథిని ఆషాఢ పూర్ణమి. ఆయనను తొలి గురువుగా పూజిస్తూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. 

జీవితానికి మార్గనిర్ధేశం చేసే గురువులను పూజించి, కానుకలు సమర్పించి ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ సందర్భంగా గురువులపై భక్తి భావాన్ని తెలిపే కొన్ని శ్లోకాలు 

2025 ఇవాళ (జూలై 10గురువారం ) గురు పౌర్ణమి 

గురు ప్రార్ధన

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః

విష్ణు స్వరూపుడైన వ్యాసుడికి , వ్యాసుడి రూపంలో ఉన్న విష్ణువుకి, బ్రహ్మవిద్యానిలయుడైన వ్యాసభగవానుడికి నమస్కారం
 
​గురువు విశిష్టత

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: 

గురువే బ్రహ్మ, గురువే శ్రీ మహావిష్ణువు, గురువే శివుడు..త్రిమూర్తి స్వరూపుడైన గురువుకి నమస్కారం...

గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌

‘గు’ - చీకటి,  ‘రు’ - ఆ చీకటిని అడ్డగించేవాడు. అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి గురువుకి మాత్రమే సాధ్యం
 
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః

అజ్ఞానమనే చీకటితో అందులైన వారిని జ్ఞానం అనే అంజనాన్నిచ్చి కళ్లు తెరిపించి నడిపించే గురువుకి నమస్కారం
 
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః 

ప్రపంచాన్ని గగనంలా వ్యాపించిన ఏ గురుతత్వం అయితే తత్ అని పిలిచే బ్రహ్మకు మరో రూపమై నిలుస్తుంది..అలాంటి గురువుకి వందనం
 
‘న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’

గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం ఇంకేదీ లేదు

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్  
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః  
గురు పౌర్ణమి శుభాకాంక్షలు

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే 
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః 
గురు పౌర్ణమి శుభాకాంక్షలు

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా 
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః
గురు పౌర్ణమి శుభాకాంక్షలు

శ్రీ కృష్ణాష్టకం

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||  

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||  

ఇతి శ్రీ కృష్ణాష్టకమ్ ||

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యే బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
ఆ 48 మంది ఎమ్మెల్యే బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
Ravi Teja : భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
Rented Property Ownership: అద్దెదారులు ఎన్నటికీ ఆ ఆస్తికి యజమాని కాలేరు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
అద్దెదారులు ఎన్నటికీ ఆ ఆస్తికి యజమాని కాలేరు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Advertisement

వీడియోలు

IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Cabinet: ఆ 48 మంది ఎమ్మెల్యే బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
ఆ 48 మంది ఎమ్మెల్యే బాధ్యత మీదే - ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం - కేబినెట్ భేటీలో కీలక చర్చ
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
పాతబస్తీలో హిందూ మైనర్‌ బాలికలను ట్రాప్ చేస్తున్నారు…. మజ్లిస్ సపోర్ట్ చేస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
Ravi Teja : భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
భర్తలకు మాస్ మహారాజ రవితేజ రిక్వెస్ట్ - 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేసింది
Rented Property Ownership: అద్దెదారులు ఎన్నటికీ ఆ ఆస్తికి యజమాని కాలేరు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
అద్దెదారులు ఎన్నటికీ ఆ ఆస్తికి యజమాని కాలేరు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
TATA Affordable Cars: రూ.10 లక్షల లోపు టాటా కార్లు.. టాటా టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, టిగోర్ ఫీచర్లు చూశారా
రూ.10 లక్షల లోపు టాటా కార్లు.. టాటా టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, టిగోర్ ఫీచర్లు చూశారా
Dhandoraa Release Date : వేశ్య పాత్రలో బిందు మాధవి - 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్
వేశ్య పాత్రలో బిందు మాధవి - 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్
Long Distance Mileage Bikes: రోజూ లాంగ్‌ రైడ్‌ చేసే పొడవైన వ్యక్తులకు మైలేజ్‌ & కంఫర్ట్‌ ఇచ్చే బైక్‌లు - నిపుణుల సూచనలు ఇవే!
కాస్త పొడవుగా ఉండి, రోజుకి 150 km వెళ్లేవారికి బెస్ట్‌ బైక్‌ ఏది? - ఇవే టాప్‌ సజెషన్లు!
Maganti Gopinath Family Problem: మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
Embed widget