Weekly Horoscope : ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆగస్టు 22 నుంచి 28 వరకూ ఈ వారం రాశిఫలాలు
Weekly Horoscope : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Weekly Horoscope : ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆగస్టు 22 నుంచి 28 వరకూ ఈ వారం రాశిఫలాలు Horoscope Weekly, August 22 to August 28, 2022, Aries, Gemini and other zodiac signs Weekly Horoscope : ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆగస్టు 22 నుంచి 28 వరకూ ఈ వారం రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/8ea5b6a8e11d28a007f14de3d89b78581661087671119217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Weekly, 2022 August 22 to August 28
మేషం
ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞులు సలహాలు మేలు చేస్తాయి. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం వల్ల అప్పుచేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశ పరుస్తుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వ్యాపారులు, ఉద్యోగులు మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బందిపెట్టేవారున్నారు అప్రమత్తంగా ఉండండి.
వృషభం
మునుపటి కన్నా ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వాహనం,ఇల్లు , భూములు కొనుగులుపై దృష్టి సారిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. వారాంతం ఆశాజనకంగా ఉంటుంది. కళారంగంవారికి కలిసొచ్చే సమయం ఇది.
మిథునం
మిథున రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్పష్టమైన మీ ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి. బంధుమిత్రులనుంచి పూర్తి సహకారం అందుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం
వృత్తి. ఉద్యోగం, వ్యాపార రంగాలవారికి ఈ వారం శుభఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో ఆంటకాలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు జోరందుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పారిశ్రామిక వర్గాలవారు తాము అనుకున్నది సాధిస్తారు.కుటుంబంలో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వారం చివరల్లో మానసిక అశాంతి ఉంటుంది.
Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి
సింహం
ఈ రాశి ఉద్యోగులకు ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. చేసే పనిలో ఊహించినదానికన్నా అధిక ఫలితాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం ఉంటుంది. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య
ఈ వారం ఈ రాశివారు ఆస్తివివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు పనివిషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు సక్సెస్ అవుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. సన్నిహితుల సలహాలు స్వీకరించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
తుల
మీ ఆలోచనలను ఈ వారం సక్రమంగా అమలు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆస్తులు లేదా వాహనం కొనుగోలుచేయాలనే ఆలోచనలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగులుకు అనుకూలమైన మార్పులుంటాయి. వ్యాపారాల్లో లాభం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం
ఈ వారం మీకు శుభసమయం. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వాహనయోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.
ధనుస్సు
ధనస్సు రాశివారికి నిన్నటి వరకూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఈ వారం నుంచి క్రమేపీ తొలగిపోతాయి.అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ పూర్తిచేస్తారు. వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ఖర్చులు తగ్గించడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది
మకరం
గడిచిన సంఘటనలను అనుభవంగా తీసుకుని ముందుకు సాగడం మంచిది. అప్పుల బాధలు కొంతవరకూ తీరుతాయి. వాహనం కొనుగోలుకి ఇదే మంచి సమయం. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మీ ప్రవర్తనతో ప్రత్యర్థులను కూడా మెప్పిస్తారు . వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది.అనవసర విషయాల్లో తలదూర్చకండి. మిత్రులసూచనలు మేలుచేస్తాయి.
కుంభం
ఆస్తి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. పారిశ్రామిక వర్గాలవారికి అనుకూల సమయం. టైమ్ వేస్ట్ చేయకండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఓ శుభవార్త వింటారు
మీనం
ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూల సమయం. రాజకీయవర్గాల వారికి పర్యటనలు కలిసొస్తాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)