By: ABP Desam | Updated at : 03 Nov 2021 06:22 AM (IST)
Edited By: RamaLakshmibai
2021 నవంబరు 02 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోండి. ఉద్యోగంలో బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రమించాలి. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోమరితనం వీడండి.
వృషభం
జాగ్రత్తగా ఉండండి, రిస్క్ తీసుకోకండి. కొంత నష్టం జరుగుతుందని అంచనా. పెట్టుబడులు దూరంగా ఉండండి. ఉద్యోగులు ఈ రోజు ప్రమోషన్‌కి సంబంధించిన వార్తలు పొందవచ్చు. ఉదర సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది. ఎవరితోనైనా విభేదాలు రావచ్చు.
మిథునం
మీ బాధ్యత మరింత పెరుగుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగస్తులు రోజంతా బిజీబిజీగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కారణం లేకుండా ఎవరితోనైనా గొడవలు ఉండొచ్చు. ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త.
కర్కాటకం
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మానసిక ఒత్తిడిని నివారించండి. పిల్లల సమస్యలు పరిష్కరించరించేందుకు ప్రయత్నించండి. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు జరుగుతాయి. వ్యాపారం కోసం ప్రయాణం చేస్తారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పనులు సులభంగా పూర్తవుతాయి. బయటి ఆహారం తినొద్దు.
సింహం
ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
కన్య
ఈ రోజు మీరు సామాజిక సేవకు సంబంధించిన పనులపై శ్రద్ధ వహించాలి. రిస్క్ తీసుకోవద్దు. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ది. యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు రావాలి. ఇష్టదైవాన్ని పూజించండి. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి.
తుల
ఆదాయం పెరుగుతుందని అంచనా. మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మరింత దృష్టి సారించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంఘర్షణ పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించాలి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
మీరు మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభం ఉంటుంది.
ధనస్సు
మీరు వ్యాపారాన్ని ప్లాన్ చేస్తుంటే, ఖచ్చితంగా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కార్యాలయంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. స్నేహితుల మద్దతు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది.
మకరం
మీరు సవాళ్లను ఎదుర్కొంటారు. దీనికి ముందు, మానసికంగా మిమ్మల్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. మెరుగైన ఫలితాలు సాధించడానికి మీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోండి. కొత్తగా పరిచయమైన వారితో అతి చనువు వద్దు. కుటుంబానికి సంబంధించిన సమస్యల వల్ల మనస్సు కలత చెందుతుంది. మీ భాగస్వామి సహాయంతో దీన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభం
మీరు అంతర్గత శాంతిని పొందుతారు. వ్యాపార సంబంధిత ప్రణాళికలను రూపొందించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిలిచిపోయిన సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు భగవంతుని ఆరాధించాలి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. టెన్షన్ తగ్గుతుంది.
మీనం
వ్యాపారంలో లాభం ఉండొచ్చు. యాత్రను వాయిదా వేయండి. ప్రభుత్వ వ్యవహారాలు సాగుతాయి. మీరు స్నేహితుడిని కలవవచ్చు. మీ పనిని సమర్థవంతంగా చేయడానికి మీరు ఒకరి సహాయం తీసుకోవచ్చు. కొత్త పనుల కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు మంచి రోజు. విద్యార్థులు లాభపడతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read:కాకులకు చావు ఉండదా. కాకికి-కర్మ కాండలకు సంబంధం ఏంటి ...!
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!
Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయణం చేయాల్సిన సందర్భాలివే!
Chanakya Niti In Telugu : భర్త అనుమతి లేకుండా భార్య వెళ్లకూడని 4 ప్రదేశాలు ఇవే!
Spirituality: రంగనాథుడు కొలువైన ఈ 5 క్షేత్రాలు చాలా ప్రత్యేకం- మీరెన్ని దర్శించుకున్నారు!
Horoscope Today: ఈ రాశులవారికి అభివృద్ధి - ఆదాయం, సెప్టెంబరు 21 రాశిఫలాలు
ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
/body>