Horoscope Today 5th May 2022: ఈ రాశివారు కెరీర్ విషయంలో టెన్షన్ పడతారు, ఈ రోజు మీ రాశిఫలితం తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 5 గురువారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. స్నేహితులతో ఫోన్లో చర్చలుంటాయి. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. పని ఒత్తిడి తక్కువ ఉండడంతో రోజంతా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి వ్యక్తులను కలుస్తారు. 

వృషభం
మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదం రావొచ్చు. సహోద్యోగులపై కోపంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.  బాధ్యతను సకాలంలో నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

మిథునం
అనవసర చర్చల్లో పాల్గొని సమయాన్ని వృథా చేసుకోకండి.కెరీర్ విషయంలో కొత్త ప్లాన్ వేసుకోండి. దంపతులు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త ఆఫర్లు లభిస్తాయి. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. మీరు ఇంట్లో ఆఫీసు పని చేయాల్సి రావొచ్చు. మీకు గౌరవం అందుతుంది. 

కర్కాటకం
నిలిచిపోయిన పనులను పూర్తి చేయలేరు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తప్పుడు చర్యలు నష్టానికి దారితీస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. దినచర్యను ఫాలో అవండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది.

Alos Read: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకూ ఏం చేయాలి, ఏం చేయకూడదు

సింహం
కుటుంబ సభ్యులపై ఊరికే కోప్పడకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచన చాలా సానుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.శుభ కార్యాల్లో పాల్గొంటారు. బాధ్యతను నెరవేర్చడంలో స్నేహితుల సహకారం లభిస్తుంది.

కన్యా
ఈ రాశికి చెందిన రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్నిసమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు  ప్రయత్నించండి. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కార్యాలయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. 

తులా
ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. పిల్లలు సెలవులను ఆనందిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు. కెరీర్ విషయంలో కొంత టెన్షన్ ఉంటుంది. వైవాహిక సంబంధాలలో కొన్ని ఇబ్బందులుంటాయి. 

వృశ్చికం
ప్రయాణంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. వ్యాపార కార్యకలాపాలు సకాలంలో పూర్తి కావు. బంధువులతో వివాదాలుంటాయి. ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

Alos Read: ఒక్కరాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం, అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు

ధనుస్సు 
ఈ రోజు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. అవసరమైన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఖర్చు ఎక్కువ చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో వివాదాలు జరగొచ్చు.

మకరం
కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దకండి. స్నేహితులతో వాగ్వాదం జరుగుతుంది. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. పదోన్నతి గురించి కార్యాలయంలో సమాచారం అందుతుంది.

కుంభం
వేసవిలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మంచి రోజు అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రహస్య శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు.

మీనం
అనవసరమైన పనికోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిచుకోండి. కార్యాలయంలో అధికారులు మీపై కోపంగా ఉంటారు. పాత మిత్రులను కలుస్తారు.

Alos Read: మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా, ఈ కష్టాలు తప్పవు

Published at : 05 May 2022 03:23 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Horoscope Today 5th may 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

IAS Couple Dog :  ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ?   బదిలీ అయిన  ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!

JioFi Postpaid Plans: జియోఫై కొత్త ప్లాన్లు వచ్చేశాయ్ - రూ.250లోపే 150 ఎంబీపీఎస్ స్పీడ్!