By: ABP Desam | Updated at : 28 Apr 2022 06:08 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఏప్రిల్ 28 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందుల్లో పడొచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు మారేందుకు తొందరపడకండి. ఇంటి పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మనసులో భయం ఉంటుంది.
వృషభం
ఆర్థికంగా లాభపడతారు.కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. పిల్లలు చదువుతో పాటు వినోదంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. అనవసర వాదనల్లో సమయాన్ని వృధా చేసుకోకండి.
మిథునం
మీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయవచ్చు. మీ లక్ష్యాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. పరిశోధన పనిలో గొప్ప విజయం సాధిస్తారు.అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల నష్టపోతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది
కర్కాటకం
కొత్త ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉంటారు.జీవిత భాగస్వామి ప్రవర్తన నిరాశకు గురిచేస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించాలి. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
సింహం
ఎక్కువ బాధ్యత కారణంగా అలసిపోతారు. వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. పాదాల నొప్పితో ఇబ్బంది పడతారు. మీ ఆలోచనను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.
కన్యా
పిల్లలకు ఉన్న సమస్య తొలగిపోతుంది. మీ పనిభారాన్ని ఇతరులతో పంచుకోండి. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. ప్రయాణం వాయిదా వేయండి.
తులా
వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. కార్యాలయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. పాత మిత్రులను కలుస్తారు.
Also Read: బుధుడి సంచారం ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటుంది
వృశ్చికం
పెండింగ్‌లో ఉన్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు షికార్లు చేస్తారు.బంధువుల వివాహానికి సంబంధించిన సమాచారం రావచ్చు.మీ రోజంతా ఆనందంగా ఉంటారు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.
ధనుస్సు
ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. మీ అవసరాలను నియంత్రించండి.వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. మీ ఆహారాన్ని నియంత్రించండి. వివాదాస్పద అంశాలను చర్చించవచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.
మకరం
స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోండి.డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆఫీసులో చాలా క్రమశిక్షణతో ఉంటారు. పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనులు సులువుగా జరుగుతాయి. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
కుంభం
కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. కార్యాలయ సమస్యలను పరిష్కరించండి.ఈ రోజు పని ఒత్తిడి చాలా ఉంటుంది. వేరేవారి పనిలో జోక్యం చేసుకోవద్దు. .
మీనం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు ఇదే మంచిసమయం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. ప్రమాదకర పనులు చేయవద్దు.
Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు