Horoscope Today 24th April 2022: ఆదిత్యుడి అనుగ్రహం ఈ రాశులవారిని ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 24 ఆదివారం రాశిఫలాలు
మేషం
విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొత్త ప్రణాళికను రూపొందిస్తారు. మంచి ప్రవర్తనను కొనసాగించండి. వైవాహిక బంధం ఆనందంగా ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు పెద్ద పదవి లభిస్తుంది.
వృషభం
కుటుంబ విషయాల్లో మీ ఆందోళనలు చాలా వరకు దూరమవుతాయి. మంచి ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో చిన్నచిన్న మార్పులు చేస్తారు. పాత పరిచయస్తులను కలుస్తారు. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.
మిథునం
పనిలో ఒకరి ఆటంకం వల్ల సమస్య రావొచ్చు. కార్యాలయంలో గందరగోళంగా ఉంటుంది. అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ఎవరికీ తప్పుడు సమాచారం ఇవ్వకండి. గత వివాదాలు పరిష్కారమవుతాయి. మీ ఇమేజ్ దెబ్బతింటుంది. డబ్బుకు కొరత ఉంటుంది.
Also Read: వేదం చివర్లో 'శాంతి శాంతి శాంతి' అని మూడుసార్లు అంటారు కదా ఎందుకు
కర్కాటకం
అప్పు తీసుకోవద్దు. శ్రమ బలంతో విజయం సాధిస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది. కార్యాలయంలో సబార్డినేట్ ఉద్యోగుల సహకారం పెరుగుతుంది. మీరు కొత్త ప్రాజెక్ట్ మొదలుపెడతారు.
సింహం
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు మంచి సమాచారాన్ని పొందుతారు. విదేశాల్లో నివసిస్తున్న పరిచయస్తులతో చర్చలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రణాళికను రూపొందించుకుంటారు. కార్యాలయంలో ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు.పనికిరాని వాటిపై సమయాన్ని వృథా చేయకండి.
Also Read: ఉద్యోగం, వ్యాపారం, విద్య, సంతానం- మీ సమస్యను బట్టి మీరు పఠించాల్సిన శ్లోకాలివే
కన్యా
ఈరోజు మంచి రోజు అవుతుంది. విద్యార్ధులు విద్య పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ వివాహాలు జరుగుతాయి. స్నేహితులతో సమయం గడపగలుగుతారు. రొటీన్‌లో లో చాలా మార్పులుంటాయి. తొందరపాటు మానుకోండి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. బంధువులను కలుస్తారు.
తులా
ఈ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎండలో తిరగొద్దు. కొత్త ఉద్యోగం ప్రారంభించేందుకు తొందరపడొద్దు. స్నేహితుడితో చర్చిస్తారు. కొన్ని విషయాల్లో గందరగోళానికి గురవుతారు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు లాభపడతారు.
వృశ్చికం
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు .శుభవార్తలు అందుకుంటారు. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీ సంపద పెరుగుతుంది. యువత ఉద్యోగాలు పొందవచ్చు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
ధనుస్సు
కోపంతో ఎవరితోనూ మాట్లాడకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తారు..మీరు తెలివిగా వ్యవహరించాలి. భాగస్వాముల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. మీ మాటతీరుతో అందర్నీ ఆకర్షిస్తారు. కొత్త పథకంలో డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: పాండవుల విజయం కోసం అర్జునుడి కొడుకును పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు
మకరం
ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. కెరీర్ పట్ల యువత అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు ఉండొచ్చు. స్నేహితులతో వివాదాలను పరిష్కరించుకోండి.
కుంభం
ఏదో విషయం గురించి కలత చెందుతారు.ప్రేమికులు ఆందోళన చెందుతారు. చిన్న లాభాల కోసం పెద్ద నష్టాలవైపు ఆకర్షితులు అవొద్దు. ఉద్యోగులు పని తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఏకాగ్రతతో మీ పనిని చేయాలి. అధిక పని అలసటకు దారి తీస్తుంది.
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ వ్యవహారాల్లో సరళత తీసుకురండి. జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని సరదాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పిల్లలు మీ మాటలను పాటిస్తారు. దంపతులు సంతోషంగా ఉంటారు.