Horoscope Today 2nd April 2022: ఉగాది రోజు ఈ రాశులవారు రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 2 శనివారం రాశిఫలాలు
మేషం
పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉత్సాహంతో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. చాలా వరకు పనులు సమయానికి పూర్తవుతాయి.ఈ రోజు సాయంత్రం ఓ శుభవార్త వింటారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. ప్రయాణాలు వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
వృషభం
స్నేహితులతో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో సంతోషం తగ్గుతుంది. ఖర్చులను నియంత్రించండి. మీ జీవనశైలిని మార్చుకోవద్దు. ఈ రోజు మీకు చాలా ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. భావోద్వేగాలను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి
మిథునం
వ్యాపారంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ప్రణాళికలు ప్రారంభించడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.వృత్తిలో పురోగతి ఉంటుంది. కొత్త మానసిక సంబంధాలు ప్రారంభమవుతాయి. మీరు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.పెట్టుబడులు కలిసొస్తాయి.
Also Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
కర్కాటకం
ఉద్యోగులకు శుభసమయం...ఉన్నత స్థానం లభిస్తుంది. ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు మీ ఆత్మగౌరవం గురించి ఆందోళన చెందుతారు.ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి.
సింహం
ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ అభిప్రాయాలను ఎవరికీ చెప్పొద్దు. బంధువులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపడకండి. పాతమిత్రులను కలుస్తారు. సామాజిక కార్యక్రమాలకు సహకరిస్తారు.
కన్యా
ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రిస్క్ తీసుకోవద్దు. విలువైన వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు సమస్యతో మీరు ఇబ్బంది పడతారు.
Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
తులా
ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు.మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కోపం తగ్గించుకోండి. అనవసర పనులకు సమయాన్ని వృథా చేయకండి.
వృశ్చికం
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తెలియని అడ్డంకి కారణంగా ప్రయాణం ప్రభావితం కావచ్చు.ప్రమాదకర పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
ధనుస్సు
ఈరోజు కాస్త భారంగా ఉంటుంది. అప్పు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండండి.ఈ రోజు అనారోగ్య సమస్యతో బాధఫడతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శించవద్దు. తెలియని వ్యక్తితో వాగ్వాదం జరగొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి
మకరం
మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీ ఆర్థిక స్థితి పెరుగుతుంది. మత్తు పదార్థాలు, లాటరీలకు దూరంగా ఉండండి.మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు సత్సంగం వల్ల ప్రయోజనం పొందుతారు.జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది.
కుంభం
కార్యాలయంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు.వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. అధిక పని వల్ల అలసట ఉంటుంది. కోపంతో ఎవరినీ దూషించవద్దు. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది.
మీనం
ఒకరిపై విమర్శలు ఒత్తిడికి దారితీస్తాయి. ఒంట్లో ఏదో నలతతో బాధపడతారు. విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీరు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏదో గందరగోళంలో ఉంటారు. సమయం మీకు అంత అనూకూలంగా లేదు జాగ్రత్త.