By: ABP Desam | Updated at : 31 Mar 2022 06:02 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మార్చి 31 గురువారం రాశిఫలాలు
2022 మార్చి 31 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మేషరాశివారికి మిశ్రమఫలితాలున్నాయి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఒత్తిడికి లోనవుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. విలువైన పత్రాలు జాగ్రత్త. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
వృషభం
ఈ రాశివారికి పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చుచేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతులు పొందుతారు.స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. అధికారులతో మీ సంబంధాలను స్నేహపూర్వకంగా ఉంచుకోండి.
మిథునం
ఈరోజు మిథున రాశివారు శుభవార్తలు వింటారు. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనవసరమైన కార్యకలాపాలను విస్మరించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో వాగ్వాదం ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కార్యాలయంలో సహోద్యోగులు మీ ప్రవర్తనకు ముగ్ధులవుతారు.
Also Read: 2022-2023లో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలంతో అన్నింటా పైచేయి మీదే
కర్కాటకం
ఈ రాశి వారికి ఉద్యోగ స్థలంలో ఒత్తిడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి గురించి చెడుగా భావించవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. తెలియని వ్యక్తులు మీకు హాని కలిగించవచ్చు.
సింహం
సన్నిహిత బంధువుల నుంచి విచారకరమైన వార్తలను అందుకుంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సోమరితనం వదలిపెట్టండి.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దాంపత్య జీవితంలో సంతోషం తగ్గుతుంది. మిత్రుల నుంచి ఆశించిన సహకారం లభించదు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ రోజు పెద్దగా కలసిరాదు. మీ కోపాన్ని నియంత్రించుకోండి.
కన్యా
పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక ప్రగతికి అవకాశాలున్నాయి. న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకోవడంలో విజయం సాధిస్తారు. ప్రస్తుతం మీరున్న రంగంపై దృష్టి సారిస్తే ముందుకు పోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలకు సమయం కేటాయిస్తారు.
Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే
తుల
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు. అప్పుగా తీసుకున్న డబ్బు ఈరోజు తిరిగి రావొచ్చు. ఆరోగ్య పరంగా చాలా ఫిట్‌గా ఉంటారు. పాత పనులు పూర్తి చేయాలనే హడావుడిలో ఉంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి.
వృశ్చికం
మీరు అనేక మూలాల నుంచి ఆదాయం పొందుతారు. కార్యాలయంలో వాతావరణం కొంత అనుకూలంగా ఉండదు. గృహ జీవితంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. మీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు పొందుతారు. మీ మనసులో మాటను బయటకు వ్యక్తం చేయండి. విద్యార్థులు పోటీపరీక్షల్లో, నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. విమర్శల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారం సమస్యలను కలిగిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. డైలమా చెందకండి..ఏ విషయంలో అయినా క్లారిటీగా ఉండండి. ప్రత్యర్థులు మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన మద్దతు లభించదు.
మకరం
వ్యాపార పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు కొత్త వనరుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు మీ ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా పయనిస్తారు.ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు కుటుంబ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు.
కుంభం
బంధువులను కలుస్తారు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు మీ పనిపై ఏకాగ్రత వహించండి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మీ నైతికతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈరోజు అప్పులు చేయకండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.
మీనం
ఈరోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పాత జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకుంటారు.ఓ శుభవార్త వింటారు. మీ సలహా తీసుకున్న వారు ప్రయోజనం పొందుతారు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!