Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023లో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలంతో అన్నింటా పైచేయి మీదే
ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో కుంభరాశి ఫలితాలు
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 5, వ్యయం : 2 ,రాజ్యపూజ్యం : 5 ,అవమానం : 4
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ధనం, కుటుంబ కారకుడైన గురుడు ధనస్థానంలో ఉన్నాడు, శని జన్మంలో ఉండగా రాహు, కేతువులు 3,9 స్థానాల్లో ఉన్నాయి.అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది.ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అంత ఇబ్బందిపెట్టదు. గతేడాదికన్నా చాలా బావుంటుంది. ఇంకా ఈ ఏడాది ఈ రాశివారికి ఎలా ఉందంటే...
- ధర్మ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
- వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి,తలపెట్టిన ప్రతి పనిలోనూ జయం తథ్యం
- సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు
- విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు
- శనిప్రభావంతో అప్పుడప్పుడు మానసికంగా ఇబ్బంది పడతారు
- బయటకు చెప్పుకోలేని ఓ సమస్యతో మగవారు ఇబ్బందిపడతారు
- రావాల్సిన మొత్తం విషయంలో ఎన్నో ఆంటకాలు ఉన్నప్పటికీ ఎట్టకేలకు అందుతుంది
- మీలో ఉన్న అహంకారం, ఒకరి కన్నా నేను ఎక్కువ అన్న గర్వం మీ పతనానికి దారితీస్తుంది...ఈ విషయాల్లో కాస్త తగ్గండి
- ఆదాయం బావుంది, గౌరవం లభిస్తుంది, స్పష్టమైన ఆలోచనా విధానం ఉంటుంది
- ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు విశేషమైన శుభాలున్నాయి
- విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
- శని, కేతువుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి
- ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి
- అనారోగ్య సమస్యలున్నాయి, వైద్యసేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది
- వ్యాపారాలు ప్రారంభంలో మందకొడిగా సాగినా క్రమంగా పుంజుకుంటాయి
- హోల్ సేల్ వ్యాపారస్తుల ఆదాయం బాగుంటుంది.
- న్యాయ, ఆస్తి వివాదాలు జటిలమవుతాయి
మొత్తంమీద ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ ఆ ప్రభావం అంతగా ఉండదు. గురుబలం బావుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా గడిపేస్తారు.మీ ధైర్య సాహసాలు, శక్తిసామర్థ్యాలకు దైవబలం, గ్రహబలం కూడా తోడవుతుంది.
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.