Horoscope Today 28th March 2022: ఈ రాశులవారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
![Horoscope Today 28th March 2022: ఈ రాశులవారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 28th March 2022: ఈ రాశులవారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/23/dbd9d8e85ca9980087fea2f70bc9a224_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 మార్చి 28 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీకు శుభఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతి సమాచారం అందుతుంది. కటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. స్థిరాస్తుల అమ్మకాల్లో భారీ లాభాలు పొందుతారు.
వృషభం
వృషభరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చాలా రోజులగా వెంటాడుతున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టపడాలి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయగలుగుతారు. బద్ధకం విడిచిపెట్టండి.
మిథునం
ఈ రోజు చేసే పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రాశి పురుషులతో పోలిస్తే మహిళలకు మంచిరోజు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యుతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి . నిరుద్యోగులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
కర్కాటకం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా-బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. విద్యా, ఉద్యోగ విషయాల్లో దూసుకెళ్తారు. అనుకోని ధనలాభం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
సింహం
చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. అప్తుల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య
చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.
వృశ్చికం
దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సోదరలు నుంచి శుభవార్త వింటారు. ఆధ్యాత్మికతపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ధనస్సు
కొంచెం ప్రతికూల వాతావరణ నడుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండండి. ధైర్యంగా పనులు పూర్తిచేయాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వు ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.
మకరం
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలఅలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ముందుగా అనుకున్న ప్రణాళికల ప్రకారం పనిచేస్తే సక్సెస్ అవుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన అవకాశములు అందుతాయి.
కుంభం
దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. దేవుడిపై భక్తి పెరుగుతుంది. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
మీనం
ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకుసాగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకోని విధంగా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి సమయానికి సహాయం అందుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)