Horoscope Today 27th March 2022: ఈ రాశివారు వర్కింగ్ స్టైల్ మార్చుకునే ప్రయత్నం చేయండి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మార్చి 27 ఆదివారం రాశిఫలాలు

మేషం
భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు.  కొంతమంది మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా పెద్ద డీల్ లాభాన్నిస్తుంది. ఓ ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేయండి. ప్రేమ సంబంధాల్లో బలం ఉంటుంది. ఈరోజు మీరు అనారోగ్యంగా,  ఆందోళనగా ఉంటారు. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అశాంతి, కోపం ఉంటుంది. కార్యాలయంలో అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయవద్దు.

వృషభం
మీరు కెరీర్‌లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సమాజంలో మీకు ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో పెద్దల మాట  వినండి. మీరు అన్ని పనులను శాంతియుతంగా చేయాలి.  పిల్లలతో మంచి సమయం గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించవద్దు.  ఈ రోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించండి. మీరు శారీరకంగా అలసిపోయి మానసికంగా ఇబ్బంది పడతారు. కార్యాలయంలో పని భారంతో అలసట చెందుతారు. 

మిథునం
ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంపై ఒత్తిడి ఉంటుంది. ఉన్నత విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన లోపం ఉండవచ్చు. మీ సహోద్యోగుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. స్నేహితులు లేదా ప్రియమైనవారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజా జీవితంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.

కర్కాటకం
జీవిత భాగస్వామి మద్దతుతో, మీ మనోబలం,  విశ్వాసం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీ రంగంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మీరు మానసికంగా చాలా రిలాక్స్‌గా ఉంటారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసు వాతావరణం బాగుంటుంది.  ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా కలిసొచ్చే సమయం.

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

సింహం
మీరు వ్యాపార సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. పాత అనుభవాల నుంచి పూర్తి ప్రయోజనం పొందుతారు. మీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. పెరుగుతున్న అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీకు ఇష్టమైన పనిపై ఆసక్తి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు.  సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. విద్యారంగంలో కొత్తగా ఏదైనా రాయాలనే స్ఫూర్తిని పొందుతారు. ప్రియమైన వారిని కలుసుకోగలుగుతారు.

కన్య
ఈరోజు సాధారణంగా ఉంటుంది.  మీరు ఆధ్యాత్మికతపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. మీరు ఆస్తి సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మనసులో ఆందోళన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. అధిక వేగంతో వాహనం నడపొద్దు. ఆస్తి, వాహన పత్రాలపై సంతకం చేయడానికి ముందు ఆలోచించండి. 

తుల
బ్రహ్మచారుల వివాహానికి అడ్డంకులు ఎదురవుతాయి.  విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది..తల్లిదండ్రులు గమనించి ఆసక్తి తగ్గకుండా ప్రోత్సహించండి. మీకు ప్రాధాన్యత లేని ప్రదేశంలో స్పందించకండి. వివాదం కారణంగా మీరు కలత చెందుతారు. కుటుంబ సమస్యలు తోబుట్టువులతో చర్చించవచ్చు. ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభించగలరు. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది.  పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం
వర్కింగ్ స్టైల్‌ మార్చుకునేందుకు ప్రయత్నించండి. సోదరులు,  స్నేహితుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. వ్యాపారంలో అమ్మకాలు పెరిగి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీరు శుభవార్తల వింటారు.  కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు ప్రతికూలతకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉండదు.  ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ఆస్తులు స్థిరంగా ఉంటాయి. మీ పెట్టుబడి ప్రణాళికను వాయిదా వేయండి.

Also Read: ఉగాది అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు

ధనస్సు
ఎక్కువ పని కారణంగా ఈరోజు అలసిపోతారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. రక్తపోటు రోగులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. కుటుంబంలోని పెద్దల మాటలు, సలహాలు మీకు నచ్చవు. వ్యక్తిగత సంబంధాల్లో ప్రేమ తక్కువగా ఉంటుంది. స్వార్థపూరిత వైఖరి కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. వ్యాపారస్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. విదేశీ వ్యాపారాల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.

మకరం
ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఆన్‌లైన్ వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి. ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ఉంటాయి. మీరు మానసికంగా గందరగోళానికి గురవుతారు. వ్యాపారంలో ప్రత్యర్థి జోక్యం పెరుగుతుంది. మతపరమైన పనులకు ధనం వెచ్చిస్తారు. ఆధ్యాత్మికవైపు మనసు మళ్లుతుంది. 

కుంభం
ఈ రోజంతా మీరు చికాకుగా ఉంటారు.  మీ మాటను, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈరోజు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. కొత్తగా ప్రారంభించే పనులకు అనుకూలమైన రోజు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.  సామాజిక కార్యక్రమం నిర్వహిస్తారు.ఆనందంగా ఉంటారు.  స్నేహితుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, పని ఒత్తిడి ఉంటుంది. 

మీనం
మీరు మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తారు. మీ పనులు చాలా వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి లభిస్తుంది. మీరు వ్యాపార ప్రయాణాల నుంచి ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంలో ఆర్థిక లాభం, సంతోషం ఉంటుంది.

Published at : 27 Mar 2022 05:40 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 27th march 2022

సంబంధిత కథనాలు

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

July 2022 Monthly Horoscope : జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

July 2022 Monthly Horoscope : జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

Monthly Horoscope July 2022: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

Monthly Horoscope July 2022: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

Horoscope 1st July 2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి

Horoscope 1st July  2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Movie Tickets Issue: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు!

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?