అన్వేషించండి

Horoscope Today 22nd March 2022: ఈ రాశి హృద్రోగులు ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 మార్చి 22 రాశిఫలాలు

మేషం 
ఈరోజంతా సంతోషంగా ఉంటారు.  అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి కుంగిపోవద్దు. అదృష్టంపై ఆధారపడొద్దు, ప్రతికూల గ్రహాల ప్రభావం మీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. 

వృషభం
సానుకూల ఆలోచనలకు దూరం కావొద్దు.  బలహీనమైన మనోబలం శత్రువును బలపరుస్తుంది. తప్పుడు వ్యక్తుల ఉచ్చులో పడకండి. మీకున్న  తెలివితేటలను ఉపయోగించుకోవడం మంచిది. అధికారిక పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. 

మిథునం
పట్టుదలతో పనిచేస్తే విజయం వరిస్తుంది. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు.  సంగీతానికి సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలు పొందుతారు. బ్యాంకు ఉద్యోగులకు శుభసమయం. అధికారిక బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. 

కర్కాటకం
ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి.  కార్యాలయంలో తన బృందంతో కలిసి పని చేయడం, అధికారి ప్రణాళికను విజయవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండండి. హోటల్‌లు, రెస్టారెంట్‌లకు సంబంధించిన వ్యక్తులు మంచి ప్రయోజనాలు పొందుతారు.  ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్త. 

Also Read: రామాయణం, మహాభారతం, భాగవతం ఈ ఒక్క శ్లోకంలో చదివేసుకోండి
సింహం
ప్రతికూల గ్రహాల పరిస్థితులు మిమ్మల్ని వ్యాధులకు గురి చేస్తాయి. విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతికూల సమాచారం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు అంతగా కలిసొచ్చే రోజు కాదిది. ఇంట్లో ఉండే మహిళలు ఒత్తిడికి లోనవుతారు. 

కన్య
మీ ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించేలా ఉంటుంది. లాభనష్టాలను చూసి ఎవరితోనూ స్నేహం చేయకండి. ఉద్యోగంలో ప్రతికూల ఆలోచనలు శాంతికి భంగం కలిగిస్తాయి. వ్యాపారం మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్న అనుభవజ్ఞుల సలహాలు తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు.

తుల
 ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేసేవారు లాభాలు చవిచూస్తారు. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. ఫ్యూచర్ గురించి విద్యార్థులు ఆలోచనా విధానం బావుంటుంది. 

వృశ్చికం
ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడం మంచిది. గతంలో జరుగుతున్న మీ పనిని సమీక్షించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి ఈ రోజు శుభప్రదం, ఏదైనా పాత ఒప్పందాన్ని నిర్ధారించవచ్చు. ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఈరోజు హృద్రోగులు అప్రమత్తంగా ఉండాలి.

Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
ధనుస్సు
 మీ సహోద్యోగులను కించపరచవద్దు.  వ్యాపారం పనిపై మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  మహిళలు తమ కెరీర్‌ను ప్లాన్ చేసుకోవడం మంచిది. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఇప్పట్లో ఆ ఆళోచన చేయకపోవడం మంచిది. 

మకరం
ఉద్యోగులు  కార్యాలయంలో శుభవార్తలు వింటారు. టెన్షన్ తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారులు సున్నితంగా మాట్లాడటం ద్వారా తమపనిని పూర్తిచేసుకోండి. మీ నెట్‌వర్క్‌ని పెంచుకుంటూనే మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయించాలి.

కుంభం
పెట్టుబడులు కలిసొస్తాయి.  ఎవరికైనా ఇచ్చిన అప్పు కూడా ఈరోజు తిరిగి పొందవచ్చు. మీరు అధికారిక పనులకు సంబంధించి మంచి సమాచారాన్ని పొందవచ్చు. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.  అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

మీనం 
వ్యాపార వర్గ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త. విద్యార్థులు పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి సాధారణంగా ఉంటుంది. మీకు నచ్చిన వంటకాలను మీరు ఆనందిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. చల్లటి వస్తువులను అధికంగా తీసుకోవద్దు.  కుటుంబంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Embed widget