Horoscope Today 11th March 2022: ఈ రాశివారు ఒత్తిడిని జయిస్తారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
![Horoscope Today 11th March 2022: ఈ రాశివారు ఒత్తిడిని జయిస్తారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 11th March 2022: ఈ రాశివారు ఒత్తిడిని జయిస్తారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/10/e1289ec0c3d451e3bf368f944a57e644_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మార్చి 11 శుక్రవారం రాశిఫలాలు
మేషం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారేందుకు నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయం. వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కోర్టు కేసుపై నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది.
వృషభం
ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. పనిపై శ్రద్ధ వహించండి. నగదు దుర్వినియోగం చేయొద్దు. ఉద్యోగులు మీ పనితీరు మార్చుకోండి.అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
మిథునం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుంది. మీరు సాంకేతిక సంబంధిత పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
కర్కాటకం
మీ దినచర్య క్రమబద్ధంగా ఉంటుంది. సహోద్యోగుల కారణంగా మీ పనికి అడ్డంకి ఏర్పడొచ్చు. నిర్మాణ పనులకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఏదైనా వివాదంలో జోక్యం చేసుకుని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు.
Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే
సింహం
ఈ రోజు మీకు మంచి రోజు. కార్యాలయంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులను కలుస్తారు. సంతానం పట్ల ఆందోళనలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని చేసుకునేందుకు ఇదే శుభసమయం. వ్యాపార సమస్యలు తొలగుతాయి.
కన్య
తన బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలుగుతారు. కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి. ఉద్యోగులకు ప్రని ప్రదేశంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగాలు మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
తులా
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. సీనియర్లతో జాగ్రత్త. ప్రేమ సంబంధాల విషయంలో ఒత్తిడులు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం
కుటుంబంలో కలహాల వాతావరణం ఉండొచ్చు. పెట్టుబడి పరంగా మీరు బలహీనంగా ఉంటారు. యువత తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కారణం లేకుండా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకండి.
Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం
ధనుస్సు
ఈ రోజు మీకు మంచి రోజు. జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో వచ్చే కొన్ని ముఖ్యమైన తప్పులను సులభంగా తొలగించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ పనుల్లో లాభం ఉంటుంది. బంధువును కలుస్తారు.
మకరం
అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల మీరు లాభపడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్ధులు చదువుతో పాటు ఇతర పనులు కూడా చేసేందుకు అడుగేయండి. వ్యక్తిగత పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవ్వరిపైనా నోరు పారేసుకోవద్దు.
కుంభం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
మీనం
ఈరోజు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. చెడు ఆలోచనలు వదిలిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. కార్యాలయంలో పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పాత సంబంధాల విషయంలో సమస్యలు తలెత్తవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)