Horoscope Today 1 December 2021: ఈ రాశివారు ఉద్యోగం మారే అవకాశం ఉంది.. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. బంధువులతో వివాదాలుండొచ్చు. చట్టపరమైన విషయాలు ప్రస్తుతానికి నిలిచిపోతాయి. ప్రమాదానికి సంబంధించిన పనులను వాయిదా వేయండి. ఆదాయం బాగానే ఉంటుంది.
వృషభం
అదృష్టం కలిసొస్తుంది. అవసరాలకు మించి ఖర్చు చేస్తారు. ఆర్థిక పెట్టుబడులు కలిసొస్తాయి. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం.
మిథునం
ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మీ పనిలో పురోగతి ఉంటుంది. రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టే ఆలోచన విరమించుకోండి. ప్రయాణాలు చేయవచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది.
Also Read: శివుడిని తిడుతూ పొగిడిన ఘనత సిరివెన్నెలదే...
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ బాధ్యత పెరుగుతుంది. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అప్పులు తీసుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒత్తిడిని జయించడానికి ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
సింహం
అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. పరధ్యానంలో ఉండకండి. అపరిచితుల సహాయం తీసుకోకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఏపనినీ వాయిదా వేయవద్దు.
కన్య
బాధ్యతతో పని చేసినా సరైన గుర్తింపు రాదు. అనవసర మాటలు కట్టిపెట్టండి. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సహాయం తీసుకోండి. మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోవడానికి వాకింగ్ చేయండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read: 2022 మరింత అరాచకం.. నోస్ట్రడామస్ భవిష్యవాణి, గతంలోనూ చెప్పిందే జరిగింది..
తుల
ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. వృద్ధులకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అపరిచితులను కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అప్పచ్చిన మొత్తం తిరిగి అందుతుంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త సమాచారాన్ని అందుకుంటారు.
వృశ్చికం
పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు కొత్త అవకాశం వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. కోపం తగ్గించుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
ధనుస్సు
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వల్ల కొందరి పనులు పూర్తవుతాయి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. పెట్టుబడికి సంబంధించి ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
మకరం
తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. మీ దినచర్య మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. రుణం మొత్తం తిరిగి వస్తుంది. బంధువులతో విభేదాలు ఉండొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి.
కుంభం
ఆఫీసు పనులు పూర్తి చేయగలుగుతారు. ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులు కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.
మీనం
కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు రోజంతా సానుకూలత ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. తెలియని వ్యక్తితో ఎక్కువగా చర్చలువద్దు . ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
Also Read: పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి