Horoscope Today 25 August 2022: మిథునం, సింహం రాశులతో పాటూ ఈ మూడు రాశులవారికి లాభదాయకం, ఆగస్టు 25 రాశిఫలాలు
Horoscope 25th August :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 25th August 2022
మేషం
ఈ రోజు మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన రోజు. మీ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కోపంతో నిర్ణయం తీసుకుంటే..ఆ తర్వాత పశ్చాత్తాపపడతారు. డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలనుకునేవారు నిర్ణయం తీసుకోవచ్చు.
వృషభం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కొత్తగా తలపెట్టిన పని పూర్తి చేయడం ద్వారా పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి వస్తున్న అడ్డంకులు తొలగిపోయి వివాహ ప్రతిపాదనలు ముందుకుసాగుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది.
మిథునం
ఈ రోజు మీపై కొంత ఒత్తిడిగా ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అన్ని సమస్యలనుంచి బయటపడతారు. మీలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కష్టపడి పని చేయడం ద్వారా కార్యాలయంలో మంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభం పొందుతారు.
Also Read: 14 ఏళ్లతర్వాత వచ్చిన శనైశ్చర అమావాస్య, ఆగస్టు 27న ఇలా చేయండి!
కర్కాటకం
ఈ రోజు మీ కెరీర్లో ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది..వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీరు కొత్త వస్తువును కొనుగోలు చేస్తే జాగ్రత్త పడండి. ఉపాధి కోసం వెతుక్కునేవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి
సింహం
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులకు మంచి రోజు. స్నేహితులు లేదా పరిచయస్తులను సడెన్ గా కలుస్తారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు సృజనాత్మక పనిలో బాగా రాణిస్తారు. మీరు కుటుంబ అవసరాలకోసం కొంత టైమ్ వెచ్చించాలి.
కన్య
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారం బాగాసాగుతుంది. మీ మాటతీరుతో అందర్నీ మెప్పిస్తారు.
తుల
ఈ రోజు మీ గౌరవం , ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో ఒకరి భవిష్యత్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేముందు వారిపై మీ అభిప్రాయాలు రుద్దకండి. వారి మాటలు పరిగణలోకి తీసుకోండి. వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. కుటుంబంలోని సభ్యుని ఆరోగ్యం క్షీణించడం వల్ల కలత చెందాల్సిన అవసరం లేదు..ధైర్యంగా ఉండాలి.
Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!
వృశ్చికం
ఈ రోజు మీరు మీ పని గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వ్యాపారంలో లాభాల కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు.పిల్లలు మీ అభిప్రాయాన్ని అంగీకరించి కొత్త కోర్సులో చేరుతారు. తలపెట్టిన పని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.
ధనుస్సు
ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల సేవలో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ పని కంటే ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు మీరు కుటుంబ సభ్యులను సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం మారాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.
మకరం
ఈ రోజంతా మీరు చిరాగ్గా ఉంటారు. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా కలత చెందుతారు. ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండి పనిచేస్తారు. తల్లితరపు నుంచి ప్రయోజనం పొందుతారు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తిచేసేందుకు ఇదే మంచి సమయం.
కుంభం
ఈ రోజు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు సాధారణ లాభం పొందుతారు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను సంప్రదిస్తారు..వారి నుంచి సహాయం పొందుతారు. ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోవడం మంచిది..లేకుంటే నష్టపోతారు
మీనం
మీన రాశి వారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రాశి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. విద్యార్ధులు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు మీ స్నేహితులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.