Horoscope Today 20 August 2022: ఈ రాశి ఉద్యోగులు అధికారుల కళ్లకు గంతలుగా మారతారు, ఆగస్టు 20 రాశిఫలాలు
Horoscope 20th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 20th August 2022
మేషం
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారులకు కలిసొచ్చే రోజు. పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. గతంలో జరిగిన పొరపాట్లు తలుచుకుని బాధపడతారు. ఒకరి సలహా నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. స్నేహితులతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఏదైనా డిస్కషన్లో పాల్గొన్నప్పుడు సంయమనం పాటించాలి.
వృషభం
నిర్మాణ పనులు చేసే వ్యక్తులు పెద్ద డీల్ పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై వాగ్వాదానికి దిగుతారు. తోబుట్టువులకు ఉన్న సమస్యలను మీరు పరిష్కరిస్తారు. ఇల్లు కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది.
మిథునం
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ సంపాదన బావుంటుంది. మీ మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మిమ్మల్ని మోసం చేసేవారున్నారు జాగ్రత్త. మీ మనస్సులో ఉన్న గందరగోళాన్ని మీరే సాల్వ్ చేసుకోండి. మీ మనసులో మాటని ఎవ్వరికీ చెప్పకండి. ఉద్యోగులకు మరింత మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
కర్కాటకం
ఒంట్లో నలతగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అధిక పట్టుదలకు పోవద్దు. తల్లిదండ్రుల సేవలో ఉండడం అవసరం అవుతుంది. అధిక పని కారణంగా రోజంతా బిజీగా ఉంటారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. మీరు వ్యాపారంలో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి
Also Read: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం
సింహం
ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు కుటుంబ సభ్యులతో చర్చించకుండా నిర్ణయం తీసుకోవద్దు.. లేదంటే చిక్కుల్లో పడతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కార్యాలయంలో అధికారుల కళ్లకు గంతల్లా మారుతారు..మీరు ఏం చెబితే అది వినే బాసులుంటారు..
కన్యా
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది.ప్రభుత్వ రంగాలకు సంబంధించిన పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. పాత స్నేహితులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు.వ్యాపారువు, ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది.
తులా
ఈ రోజు మీరు ప్రమాదకర పనుల్లో తలదూర్చకపోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. అత్యవసరం కాకుంటే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. గతంలో ఉన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. ఓ వ్యక్తితో వివాదం మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. మీ బందువులు కొందరు మీ సహాయం కోరుతారు.
వృశ్చికం
ఈరోజు మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు మంచి పనితీరు కనబరుస్తారు. మీరు పాత స్నేహితుడిని లేదా భాగస్వామిని కలుసుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఖర్చుల గురించి కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారం చేసేవారు ఆశించిన లాభం పొందుతారు. విద్యార్థులకు చదువులో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం అవుతాయి.
Also Read: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
ధనస్సు
ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటారు. కొన్ని పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. అనవసరమైన రిస్క్ తీసుకోవద్దు. మీపై దేవుడి దయ ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు.ఎవరి సలహాను అయినా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓసారి ఆలోచించండి. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది.
మకరం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు మీదరి చేరనివ్వకండి. లేదంటే వాటి ప్రభావం మీపై చాలా పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పొదుపు ప్రణాళికలు వేసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవాలి. తియ్యని మాటలు చెప్పి ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది జాగ్రత్త.
కుంభం
గృహస్థులకు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే వారి సహోద్యోగుల దూషణలకు గురవుతారు. వ్యాపారులు లాభపడతారు. జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. మీ పిల్లల కెరీర్ కి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు.
మీనం
ఈ రోజు మీరు మీ పని రంగంలో కొన్ని మార్పులు చేయడం గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగులకు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ మనోధైర్యం పెరుగుతుంది. ఆదాయం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.