Horoscope Today 1st June 2022: జూన్ నెలలో మొదటి రోజు మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 1st June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
జూన్ 1 బుధవారం రాశిఫలాలు (Horoscope Today 1st June, 2022)
మేష రాశి
ఉద్యోగానికి సంబంధించిన సమస్య పరిష్కారమవుతుంది. మీ జీవిత భాగస్వామి సలహాలు పాటించండి. తోబుట్టువులతో సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈరోజంతా సానుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్‌కు సంబంధించిన వారికి శుభసమయం.
వృషభ రాశి
మీకు విధేయత చూపమని ఎవరినీ బలవంతం చేయవద్దు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి.
మిథున రాశి
మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో సీనియర్ అధికారుల మద్దతు మీకు లభిస్తుంది.
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
కర్కాటక రాశి
మీ పనితీరుపై విమర్శలొస్తాయి. మీ జీవిత భాగస్వామితో కఠినంగా మాట్లాడకండి. వ్యాపారంలో అస్థిరత ఉండొచ్చు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఖర్చులు తగ్గించుకోండి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎ
సింహ రాశి
అప్పుల విషయంలో కొనసాగుతున్న ఒత్తిడి తొలగిపోతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. మీరు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తారు.
కన్యా రాశి
ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు ప్లాన్ చేస్తారు. లగ్జరీ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు విదేశీ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి.
తులా రాశి
ఉద్యోగంలో రాణిస్తారు. జీతం పెరగుతుంది. కమిషన్ సంబంధిత పనుల నుంచి లాభం పొందుతారు. సామాజిక, మతపరమైన పనులకు డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.
వృశ్చిక రాశి
విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆడంబరాలు విడిచిపెట్టండి. ఉద్యోగం మారాలి అనుకుంటే కంగారుపడొద్దు.. కాస్త ఆగండి. అధిక పని ఒత్తిడి వల్ల అలసిపోతారు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్
ధనుస్సు రాశి
కార్యాలయంలో అధికారుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి ఆస్తి లభిస్తుంది. మీరు కొత్త వ్యాపార లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
మకర రాశి
మీరు దూరంగా ఉండాలి. ఆఫీసులో అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీ సమర్థత పెరుగుతుంది. చాలా వరకు పనులు సకాలంలో పూర్తి కావు. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి.
కుంభ రాశి
కుటుంబానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. కొత్త పనుల వల్ల ధనలాభం ఉంటుంది.జీవిత భాగస్వామి నుండి బహుమతి అందుకుంటారు. భావోద్వేగానికి లోబడి ఎలాంటి వ్యాపార నిర్ణయాలను తీసుకోవద్దు. ఒకరి పట్ల ఆకర్షితులవుతారు.
మీన రాశి
శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు కోపం రావచ్చు. కొంత టెన్షన్ ఉంటుంది. పెద్ద వ్యాపార ఒప్పందం ప్రభావితం కావచ్చు. మీరు పితృ వివాదాలలో చిక్కుకోవచ్చు.
Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...