Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు
Horoscope 18th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 18th August 2022
మేషం
ఈ రాశివారు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కాదు కూడదని ముందుకెళితే నష్టపోతారు. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులమకు మంచి రోదు. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సమస్య గురించి చర్చిస్తారు.
వృషభం
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే మహిళలు స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. పిల్లల వైపునుంచి శుభవార్త వింటారు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు శుభసమయం. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసే వారు ఏదైనా మోసం జరగకుండా జాగ్రత్త వహించాలి.
మిథునం
ఈ రోజు మీకు కష్టతరమై రోజు అవుతుంది. విద్యార్థులు కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు. అప్పులు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వండి. ఆహారంపై శ్రద్ధ వహించండి లేదంటే పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి. చట్టపరమైన విషయాలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. సోదరులతో సమస్యలు పరిష్కరించుకుంటారు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
కర్కాటకం
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. కుటుంబంలో ఎవరికైనా వివాహంలో తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. ఇంటా బయటా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడే ఏ అవకాశాన్ని కూడా మిస్సవరు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
సింహం
ఈ రోజు మీకు ఉత్సాహాన్ని నింపే రోజు. కొంతమంది వ్యక్తులను కలుస్తారు..వారి కారణంగా ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీపై స్నేహితులు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేయొచ్చు..మీరు మీ అభిప్రాయాన్ని నిర్భయంగా బయటకు చెప్పండి. విద్యార్థులు చదువులో ఎదురవుతున్న సమస్యల గురించి తల్లిదండ్రులతో మాట్లాడండి.
కన్య
ఈ రోజు మీకు ఒత్తిడిగా అనిపిస్తుంది. స్నేహితులతో గొడవపడతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాదనకు దిగొద్దు. కుటుంబంలో ఎదురైన ఓ సమస్యను పరిష్కరించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, మీరు వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
తులా
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ విషయంలోనూ వేరొకరితో పోల్చుకోవద్దు..ఇది మీకు చాలా హానికరం. మీ కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాక బయటకు వెళితే వెళ్లిన పని సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటారు. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు.
వృశ్చికం
ఈ రోజు మీరు కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీ వంతు కృషి చేయవలసి ఉంటుంది. గొడవలు జరుగుతుంటే ఇరువర్గాల మాట విన్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడుపుతారు. ప్రయాణ సమయంలో వాహనం ఇబ్బందిపెడుతుంది. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు.
ధనస్సు
ఉద్యోగస్తులకు ఈరోజు బావుంటుంది..ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రోజు తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొంత పనిని ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపుచేసుకోవాలి. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు.
మకరం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పనిలో నిర్లక్ష్యం లేకుండా పూర్తిచేస్తారు. ఉద్యోగులు తమపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అస్సలు ఇ్వరు. మీ మాటతీరు ద్వారా కుటుంబంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించవచ్చు.
Also Read: శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం
కుంభం
ఈ రోజు మీరు వరుస శుభవార్తలు వింటారు. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు, పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి మీరు చాలా కష్టపడాలి. మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు..
మీనం
ఈ రోజు మీనరాశివారి ఆరోగ్యం బావుంటుంది. ఇంతకుముందు ఏ విషయంలో అయినా బాధపడితే ఈ రోజు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మీ పనితీరుతో పై అధికారులను మెప్పిస్తారు. మీ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటారు...