అన్వేషించండి

Horoscope 5th July 2022: ఈ రాశివారు సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, జులై 5 మంగళవారం మీ రాశిఫలితం తెలుసుకోండి!

Horoscope 05-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

జులై 5 మంగళవారం రాశిఫలాలు (Horoscope 05-07-2022)  

మేషం
ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.ఫ్యాషన్, గ్లామర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. సానుకూల ఆలోచనల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాన్ని పూర్తిచేస్తారు. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు.

వృషభం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.

మిథునం
ఈ రోజు మీకు చాలా మంచిరోజు. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. మీరు ఇతరులకు సహాయం చేస్తారు. ఓ గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. వ్యాయామం , యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. 

Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

కర్కాటకం
మీ పని విషయంలో ఇతరులపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. కొత్త సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగేయండి. అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. మరింత కష్టపడితే కానీ ఉత్తమ ఫలితాలు అందుకోలేరు. ఎవరినీ దుర్భాషలాడొద్దు.

సింహం
అధిక పనివలన అలసిపోతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో మీ బాధ్యత పెరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు ప్రారంభిస్తారు.  కుటుంబం ,స్నేహితులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారంలో భారీ లాభాలుంటాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. 

కన్య
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. సమయపాలన అలవాటు చేసుకోండి. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని లావాదేవీల విషయంలో అనవసరంగా తలదూర్చవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. డయాబెటిక్ రోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మానసికంగా మీరు బలంగా ఉంటారు. 

తులా 
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కెరీర్ విషయంలో చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీరు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. 

వృశ్చికం
ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  మనసులో ప్రశాంతత ఉంటుంది. మీ మనసు చెప్పింది వినండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరొచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం.

ధనుస్సు 
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తీరుతాయి..గతంలో కన్నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంట్లో ఉన్న వృద్దులను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు.

మకరం 
మకర రాశివారికి ఈరోజు అంతగా బాలేదు. కుటుంబ సభ్యులతో అనవసర విషయాలకే వివాదం తలెత్తుతుంది. కోపంతో దూషించే పదాలు వాడొద్దు...వివాదం మరింత పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పాత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

కుంభం 
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ సమస్య పరిష్కారం అవడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో ఒకరి వివాహంపై చర్చ జరుగుతుంది. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పొచ్చు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.

మీనం 
దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. మీ పనిని మీరు నమ్మండి. మీ కిందస్థాయి ఉద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దు. నూతన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు.  ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget