Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope 02-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 2 శనివారం రాశిఫలాలు (Horoscope 02-07-2022)
మేషం
ఏదో అసౌకర్యం మీ మానసిక ప్రశాంతతను పాడుచేస్తుంది. అదనపు ఆదాయం కోసం మీ బుర్రకు పదునుపెట్టండి. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవడం వల్ల తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు. పెద్ద వ్యాపార లావాదేవీలు చేస్తున్నప్పుడు మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ ప్రణాళికలో చివరి నిముషంలో మార్పులుండొచ్చు.
వృషభం
ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కొత్త వ్యక్తులను నమ్మొద్దు. కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు మంచి ప్రయోజనం పొందబోతున్నారు. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం.
మిథునం
డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక కలిగి ఉంటారు. సానుకూల ఆలోచనల ద్వారా మీ శక్తిని మరింత పెంచుకోండి. మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
కర్కాటకం
ఈ రోజు మీకు శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. మానసికంగా ఏదో విషయంలో బాధపడతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు , విద్యార్థులకు సాధారణంగా ఉంది.
సింహం
ఇతరుల విజయాన్ని ప్రశంసించడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. భవిష్యతో కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడులు పెట్టండి కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కన్య
మీరు పనిచేసే రంగంలో విజయాన్ని పొందుతారు. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మాట్లాడడం తగ్గించి ఇతరుల మాటలు వినండి. ముఖ్యమైన సమాచారం పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి.
Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి
తుల
మీ మానసిక స్థితిని మార్చుకోవడానికి ఏదైనా సామాజిక కార్యక్రమానికి హాజరవ్వండి. వాస్తవానికి దూరంగా ఉండే మీ ప్రణాళికలు మీ డబ్బును హరిస్తాయి. చదువుకోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. తల్లిదండ్రుల కోపానికి గురికావొద్దు.
వృశ్చికం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటారు. పని నిదానంగా జరుగుతుంది కానీ పూర్తవుతుంది. మీ మాట తీరు, ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.
ధనుస్సు
మీ అనారోగ్యం గురించి పదే పదే చర్చించవద్దు. అనారోగ్యం అనే ఫీలింగ్ నుంచి బయటపడేందుకు మీ దృష్టిని మీరు మరల్చుకోండి. సంతోషంగా ఉండేందుకు ట్రై చేయండి. ఉద్యోగులు, వ్యాపారులు మరింత కష్టపడాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధతగ్గుతుంది.
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
మకరం
మీకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. చాలా రోజులుగా పనుల్లో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏకాగ్రతతో పనిచేస్తే మీ సమస్యలు తీరుతాయి. ఈ రాశికి చెందిన ఆటగాళ్లకు మంచి రోజు. పోటీల్లో గెలుస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి.
కుంభం
ధ్యానం, యోగా చేయండ ద్వారా మీరు ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. కుటుంబంతో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. విద్యార్థులకు చదువు ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. వ్యాపారులు మరింత కష్టపడాలి.
మీనం
ఈ రోజు వ్యాపారవేత్తలకు మంచి రోజు. మంచి లాభాలొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి మంచిది. ఎంతటి సమస్యనైనా మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలుగుతారు. కార్యాలయంలో ఉద్యోగులు పనివిషయంలో రాజీ పడొద్దు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. లాంగ్ డ్రైవ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read: ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు