By: RAMA | Updated at : 03 Aug 2022 05:47 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope 3rd August 2022
మేషం
ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. మనసులో ఏదో అసంతృప్తి, నిరుత్సాహం ఉంటుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రణాళికేతల ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ సహోద్యోగుల ముందు మీ ప్రాణాళికలు చెప్పొద్దు.
వృషభం
వ్యాపారంలో ఆశించిన లాభం వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యపై దృష్టి సారిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. వృద్ధుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి ఉండొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం
విద్యా విషయాల్లో గౌరవం లభిస్తుంది.స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమయానికి ధనం చేతికందుతుంది. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. సహనం తగ్గుతుంది. ఏదో చికాకుగా అనిపిస్తుంది. మీ తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులొచ్చే అవకాశం ఉంది.
కర్కాటకం
కర్కాటక రాశివారు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో సంయమనం పాటించాలి. మధ్యాహ్నం తర్వాత శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లుతాయి. మిత్రుల నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
సింహం
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు చెప్పిన విషయాలు కొన్నింటిని ఎదుటివారు అపార్థం చేసుకోవచ్చు. మీకు సంబంధం లేని వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఇప్పటికే ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోండి. మీ సత్తా చాటుకునేందుకు ఇదే సరైన సమయం. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.
కన్య
మీ మనసుకు అనుగుణంగా పనుల్లో పురోగతి ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. ఆర్థిక విషయాలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. స్నేహితుల సహాయంతో వ్యాపారం విస్తరిస్తారు.
Alos Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
తుల
ఓపికగా ప్రయత్నిస్తే చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు తెలిసిన వ్యక్తుల నుంచి ముఖ్యమైన సలహాలు అందుతాయి. మీ పని చాలా వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశాంతతనిస్తాయి. మీ జీవితంల కొత్త ఆనందాన్ని అనుభవిస్తారు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.
వృశ్చికం
మీరు అనుకున్న ప్రకారం పనులు పూర్తికావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులు, సోదరుల నుంచి మీకు పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఖర్చులు అదుపులో ఉంటాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు
వ్యాపారంలో ఆశించిన లాభం వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా పనులపై దృష్టి సారిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. వృద్ధుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పురోగతి ఉండొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది
Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ
మకరం
వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి. ఏదో తెలియని అస్తవ్యస్త పరిస్థితులుంటాయి.మనసులో ప్రతికూల ప్రభావం ఉంటంది. స్నేహితుల సహాయంతో కాస్త బయటపడతారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరగవచ్చు.
కుంభం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరస్పర సామరస్యం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి, ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది.
మీనం
ఓపికగా ప్రయత్నించండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైద్య ఖర్చులు పెరుగుతాయి.మనసులో నిరుత్సాహం, అసంతృప్తి ఉంటుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆదాయంలో తగ్గుదల మరియు ప్రణాళికేతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు
Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు
Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?