Horoscope 2nd August 2022 Rashifal :ఈ రాశివారు అనుకున్న పనులన్నీ ఈ రోజు చేసేస్తారు, ఆగస్టు 2 రాశిఫలాలు
Horoscope 2 August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
ఆగస్టు 2 రాశిఫలాలు (Horoscope 2nd August 2022)
మేషం
వ్యాపార విస్తరణకు అవకాశాలుంటాయి.కొత్తగా ఉద్యోగంలో చేరినవారు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. స్థిరాస్తుల కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం . పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది.
వృషభం
ఈ రోజు ఎనర్జటిక్ గా పనిచేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయం కన్నా ముందే పూర్తవుతుంది.ఈ రాశికి చెందిన ఇంజినీర్లు వారి అనుభవాన్ని సరైన దిశలో ఉపయోగిస్తారు. ముఖ్యమైన పనిలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథునం
కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన వ్యవహారాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి..సక్సెస్ అవుతాయి.
Also Read: సౌభాగ్యం, మంచి సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం చేసే మంగళ గౌరీ వ్రత విధానం
కర్కాటకం
ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న పనులు పూర్తిచేస్తారు. నూతన ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉన్నత విద్య లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ప్రయత్నాలు ప్రారంభించండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు.
సింహం
ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. మీరు ఎక్కడికైనా సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు.
కన్య
ఆర్థికంగా మరో మెట్టు ఎక్కే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీరు ఏ విషయంపై మాట్లాడినా మీ అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
Also Read: శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ముందుగా పసుపు గణపతి పూజా విధానం
తుల
ఈ రోజు తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అంత మంచిగా ఉండదు. కొన్ని అనవసరమైన టెన్షన్‌లు వస్తాయి. మానసికంగా కాస్త అశాంతిగా ఉంటారు.
వృశ్చికం
గడిచిన రోజుల కన్నా ఈ రోజు మీకు మెరుగ్గా ఉంటుంది. కార్యాలయంలో సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రోజంతా రిఫ్రెష్ గా ఉంటారు. ఈ రాశికి చెందిన రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.
ధనుస్సు
కొన్ని ప్రత్యేక పనుల్లో స్నేహితుల మద్దతు పొందుతారు. ముఖ్యమైన విషయాలపై మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేయాల్సి రావొచ్చు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.
మకరం
మీరు ఇష్టంగా చేసే ప్రాజెక్టుల నుంచి లాభపడతారు.మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇచ్చిన అప్పు మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది.
కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు, మీ సన్నిహితులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకండి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఈ రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదరకంగా ఉంటుంది.
మీనం
చాలా వరకు పనులు పూర్తవుతాయి. స్నేహితుల సాయంతో పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు పొందుతారు.