News
News
X

Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 29-06-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జూన్ 29 బుధవారం రాశిఫలాలు (Horoscope 29-06-2022)  

మేషం
ఆఫీసు పనిలో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపార వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుకూలమైన రోజు. రోజంతా హడావుడిగా ఉంటారు. కుటుంబ విషయాల గురించి తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృషభం
ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు.మీ పని పట్ల శ్రద్ధ వహిస్తారు. సహోద్యోగుల కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ప్రేమసంబంధాలు సరిగా ఉండవు. మంచి సంభాషణ కొనసాగించండి. విద్యార్థులు ఈరోజు చదువు విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటారు. నిరుద్యోగులకు మంచి సమయం.

మిథునం
సామాజిక రంగంలో ఆధిపత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మంచి సమాచారం వినే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రసంసలు అందుకుంటారు. 

Also Read: ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు

కర్కాటకం
ఈ రోజంతా కొంత గందరగోళంలో ఉంటారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించి నడుస్తున్న కేసులు ఆలస్యం అవుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించాలి. కొంతమంది మిమ్మల్ని నిందించవచ్చు. ఇనుముకి సంబంధించిన వ్యాపారులు నష్టపోతారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 

సింహం
వ్యాపారానికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు మీకు కలిసొస్తుంది. జీవిత భాగస్వామిని మాటలతో మెప్పిస్తారు. కంటికి సంబంధించిన ఇబ్బందులు కొంత ఉండొచ్చు. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి.

కన్య
రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో మీ బంధం దృఢంగా ఉంటాయి. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. వినయంతో కూడిన స్వభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. స్నేహితులతో తీవ్రమైన విషయాలను చర్చించవచ్చు. మీరు మీ బాధ్యత గురించి కొంచెం భయపడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి.

Also Read: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది

తులా
ఈ రోజు  మీకు మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ మాటల ప్రభావం ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి.

వృశ్చికం
మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు.తెలివైన వ్యక్తుల సలహాలు పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవసరం లేని దగ్గర మీ సామర్థ్యాన్ని ప్రదర్శించవద్దు. అధిక శ్రమ వల్ల అలసట ఉంటుంది.

ధనుస్సు  
మీ దినచర్యను మార్చుకునే ఆలోచన చేయడం మంచిది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. తంత్రానికి సంబంధించిన మంత్రంపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ సలహాకు ప్రాధాన్యత ఉంటుంది. మీకు సహాయపడే వ్యక్తులను మీరు గుర్తిస్తారు. దూర ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. 

Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!

మకరం
బంధువులతో సత్సంబంధాలుంటాయి.కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రయాణం చేయవలసి రావొచ్చు. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు. ఏ పని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.

కుంభం
ఈ రోజు మీకు ధనలాభం ఉంటుంది. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కుటుంబంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కార్యాలయంలో బాస్ మీపై కోపంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ పై కొంత ఆందోళన ఉంటుంది. స్నేహితులతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. 

మీనం
కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి భావాలను పరిగణలోకి తీసుకోండి. నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో మనోధైర్యం పెరుగుతుంది. కొత్తగా చేపట్టే పనులుంటే ప్రారంభించేందుకు మీకు ఈ రోజు మంచి రోజు. కోపాన్ని నియంత్రించుకోవాలి. 

Also Read:  జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!

Published at : 28 Jun 2022 04:38 PM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs astrological prediction for 29 june 2022

సంబంధిత కథనాలు

Vastu Tips: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు  ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

Vastu Tips: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

Tirumala: ప్రతి వారం సహస్ర కలశాభిషేకం రద్దు చేసిన టీటీడీ, ఎందుకో తెలుసా !

Tirumala: ప్రతి వారం సహస్ర కలశాభిషేకం రద్దు చేసిన టీటీడీ, ఎందుకో తెలుసా !

Horoscope 10 August 2022 Rashifal : ఈ రాశులవారు జీవిత భాగస్వామి సహాయంతో స్తిరాస్థిని కొనుగోలు చేస్తారు, ఆగస్టు 10 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 10 August 2022 Rashifal : ఈ రాశులవారు జీవిత భాగస్వామి సహాయంతో స్తిరాస్థిని కొనుగోలు చేస్తారు, ఆగస్టు 10 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

టాప్ స్టోరీస్

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక