News
News
X

Horoscope 23 July 2022: ఈ రాశివారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు, జులై 23 రాశిఫలాలు

Horoscope 23 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జులై 23 శనివారం రాశిఫలాలు (Horoscope 23-07-2022)

మేషం 
వ్యాపారులకు మంచి రోజు, ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.కొత్త పరిచయాలతో జాగ్రత్తగా మసులుకోండి. అనైతిక సంబంధాల వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. ఆధ్యాత్మిక విషయాలపై దష్టిసారిస్తే మనశ్సాంతి లభిస్తుంది. 

వృషభం
ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. మీ జీతం పెరుగుదల గురించి మాట్లాడేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం ముందుకు సాగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు కలిసొస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

మిథునం
కార్యాలయంలో మాట్లాడేటప్పుడు ఆలోచనాత్మకంగా మాట్లాడండి.నిరుద్యోగులకు మంచి సమయం. ఆలోచనలు సానుకూలంగా ఉంచండి.  వ్యాపారులు, ఉద్యోగులకు కుటుంబ మద్దతు లభిస్తుంది. స్నేహితుల మద్దతు పొందుతారు. 

Also Read:  జులై 23 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు

కర్కాటకం
తోడబుట్టినవారితో వివాదాలు కుటుంబంలో అస్థిరతను సృష్టిస్తాయి. ప్రేమ సంబంధాలు అలాగే ఉంటాయి. అంకితభావంతో పనిచేస్తే ఉన్నతాధికారులను ఇంప్రెస్ చేయొచ్చు. 

సింహం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీపనిలో ఏది ముందు ఏది తర్వాత అనేది అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన పనుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. తలపెట్టిన పనులు కొన్ని పూర్తిచేయడంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. తల్లిదండ్రుల ప్రేమను పొందుతారు.

కన్య
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఉద్యోగం మారేందుకు ఇది మంచి సమయం కాదు. వ్యాపారులు కొత్త ప్రయత్నాలు చేయొద్దు..పాత పద్ధతులే కంటిన్యూ చేయండి. పాతవివాదాలు తెరపైకి రావొచ్చు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మానసిక సమస్యలు పెరుగుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 

తుల
ఈ రోజు చాలా వివాదాస్పదంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. మీ బలహీనతను ఉపయోగించుకునేవారున్నారు జాగ్రత్త.వ్యాపారులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

Also Read:   గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి

వృశ్చికం 
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ బాగా సాగుతుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ వైపు పనిచేసేవారికి శుభసమయం. కొత్త వ్యాపార ప్రణాళికలు వేసుకునేందుకు మంచి రోజు. విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. 

ధనుస్సు 
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.వ్యాపారంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి.పని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు. ఇంట్లో కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మకరం
నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో పరిస్థితులు మీకు కలిసొస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోండి. మీ సత్తా చాటుకునేందుకు ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామి నమ్మకాన్ని వమ్ము చేయకండి. 

Also Read:  ద్రౌపది గురించి ఈ విషయాలు మీకు తెలుసా!

కుంభం
కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీకు అందరి సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. పిల్లల చదువులు చక్కగా సాగుతాయి. మిమ్మల్ని మీరు ఎనర్జిటిక్ గా భావిస్తారు. వైవాహిక సంబంధాలు బావుంటాయి. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

మీనం
ఈ రోజు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. క్రమరహిత దినచర్యను మార్చుకోకుంటే చాలా నష్టపోతారు. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. మీ ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు చేయండి. మీపై మీ వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. 

Published at : 22 Jul 2022 04:46 PM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs aaj ka rashifal 23july 2022 astrological prediction for 23 july 2022

సంబంధిత కథనాలు

Horoscope Today, 14 August 2022:  ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Mangal Gochar 2022: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

Mangal Gochar 2022: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం

Mars Transit 2022: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!

Mars Transit 2022: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !

టాప్ స్టోరీస్

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

Har Ghar Tiraraga: ఢిల్లీ నుంచి గల్లీదాకా హర్ ఘర్‌ తిరంగా - దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు

Har Ghar Tiraraga: ఢిల్లీ నుంచి గల్లీదాకా హర్ ఘర్‌ తిరంగా - దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు