![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Horoscope 24 July 2022: ఈ రాశివారి గౌరవం-కీర్తి పెరుగుతుంది, జులై 24 రాశిఫలాలు
Horoscope 24 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
![Horoscope 24 July 2022: ఈ రాశివారి గౌరవం-కీర్తి పెరుగుతుంది, జులై 24 రాశిఫలాలు Horoscope 23 July 2022 astrological prediction for Leo, Aries , Virgo and Other Zodiac Signs check Astrological Prediction Horoscope 24 July 2022: ఈ రాశివారి గౌరవం-కీర్తి పెరుగుతుంది, జులై 24 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/a1127ca529233453aed9ca7fa21a381a1658567894_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జులై 24 ఆదివారం రాశిఫలాలు (Horoscope 24-07-2022)
మేషం
ఈ రోజు ఈ రాశివారికి అనవసర ఖర్చు పెరగడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా పని చేసి ఇబ్బంది కలిగించవచ్చు. ప్రమాదంలో గాయపడే అవకాశం ఉంది జాగ్ర్తత్త. వ్యాపార పర్యటనలు అనుకూలించవు. మీ శత్రువులు రహస్యంగా మీకు వ్యతిరేకంగా పని చేసి మీకు ఇబ్బంది కలిగిస్తారు.
వృషభం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. ఓపికగా వ్యవహరిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి.
మిథునం
మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.ఈ రోజు కొంత అసహనంగా ఉంటారు. విద్యార్థులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు.
Also Read: జులై 24 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మతత్రయ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం
కర్కాటకం
సాహిత్యం, కళ, రచన, సంగీతం, చలనచిత్రం లేదా క్రీడలకు చెందినవారు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందుతారు. ఈ రోజు కుదుర్చుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. గౌరవం, కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో సానుకూల అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం మార్చాలి అనుకుంటే ఇదే మంచి సమయం.
సింహం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. సామాజిక సేవపై ఆసక్తి ఉంటుంది. పనిలో సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
కన్య
విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం. రియల్ ఎస్టేట్ చర్చలు వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా ధనవ్యయం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి దిశగా అడుగేసేందుకు వచ్చే కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Also Read: రానున్న నాలుగు నెలలు ఈ ఐదు రాశులవారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!
తుల
ఈ రోజు మీకు చాలా బావుంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని పనులు చేయించుకోగలుగుతారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు సృజనాత్మక రంగాలలో అనూహ్యంగా రాణిస్తారు.
వృశ్చికం
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు పెద్దగా మార్పులుండవ్
ధనుస్సు
ఈ రోజు ధనస్సు రాశివారి చేపట్టిన పని విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి.ఉద్యోగులు పదోన్నతకి సంబంధించిన సమాచారం వింటారు. మీ భాగస్వామి మీ ఆలోచనలను స్వీకరిస్తారు.
Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి
మకరం
జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇంట్లో చికాకుగా ఉంటుంది. కానీ ప్రశాంతంగా వ్యవహరిస్తే త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుంది. పిల్లల ప్రేమను పొందగలుగుతారు. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది.
కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారంలో భాగస్వామి నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమికులకు మంచి రోజు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేయడంవల్ల లాభాలు పొందుతారు.
మీనం
పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. కొన్న ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. రోజంతా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉండొచ్చు. కార్యాలయంలో కొత్త మార్పులు చేయకపోవడమే మంచిది. ఉన్నతాధికారులను కలుస్తారు. పిల్లల వైపునుంచి ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)