News
News
X

Horoscope 15th July 2022: ఈ రాశివారి జీవితంలో కొత్త వెలుగు రాబోతోంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 15 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జులై 15 శుక్రవారం రాశిఫలాలు (Horoscope 15-07-2022)

మేషం
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వృత్తి వ్యాపారాలు చేసేవారికి శుభసమయం. పనిలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని పరిచయాలు ఆర్థికంగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి.మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. 

వృషభం
ఈ రోజు మీ జీవితంలో కొత్త ఆనందం రాబోతోంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా దఢంగా ఉంటారు.  

మిథునం
ఈ రోజు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఎప్పటినుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉన్నతాధికారుల దయతో పదోన్నతికి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. 

Also Read: మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి, ఆధ్యాత్మిక కారణాలేంటి - సైన్స్ ఏం చెబుతోంది!

కర్కాటకం
ఆకస్మిక ద్రవ్య లాభాలు ఉండొచ్చు. రావాల్సిన కొంత మొత్తం ఆగినా అవసరానికి సరిపడా డబ్బు చేతికందుతుంది.కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు తమ పనితీరుని మెరుగుపర్చుకునే నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది. 

సింహం
ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సమాజికంగా గౌరమ మర్యాదలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకు  సహాయం చేస్తారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. 

కన్యా
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ మాటలు చాలామందికి మోటివేషన్ కలిగిస్తాయి. కొన్ని క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రోజువారి పనులు పూర్తిచేయగలుగుతారు. రోజంతా సరగాదా ఉంటారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు ఓ కొలిక్కి వస్తాయి. 

తులా
తులారాశికి చెందిన వ్యాపారులు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీకుంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. 

Also Read: 'అమ్మకు ప్రేమతో' శ్రీ కృష్ణదేవరాయలు తీర్చిదిద్దిన ఆలయం, ఆ గ్రామానికి తన తల్లి పేరే పెట్టిన రాయలువారు 

వృశ్చికం
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజు మీరు చేయబోయే కొన్ని పనులు రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి చేస్తాయి. క్లిష్టమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇదే మంచి సమయం. మీ తెలివితేటలు, సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి. 

ధనుస్సు
ఈ రోజు మీరు రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండాలనే భావన నుంచి బయటకు రండి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాదించే దోరణి మానుకోండి. కోపం ప్రదర్శించకండి. 

మకరం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. రచనా రంగానికి చెందిన వారికి చాలా మంచి రోజు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు బాగానే ఉంటుంది. 

కుంభం
ఈ రోజు మీరు చేసే పనులకు కుటుంబం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. వినోదం, విలాసాల కోసం ఎక్కువ ఖర్చులు చేయవద్దు. జీవిత భాగస్వామి మాటలకు విలువనివ్వండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెంచుకోవాలి. విద్యార్థులు చదువునుంచి పక్కదారి పట్టొద్దు. 

మీనం
ఈ రోజు మీరు ఏ పని చేసినా దాని నుంచి కచ్చితంగా కొంత ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం రకరకాల ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.

Also Read: జులై 15 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం ఇక్కడ చూసుకోండి

Published at : 14 Jul 2022 12:59 PM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs astrological prediction for 15th july 2022 aaj ka rashifal 15 july 2022

సంబంధిత కథనాలు

Nellore News : రైల్వే ట్రాక్ మధ్యలో దర్గా, నెల్లూరులో ఇదో అద్భుతం   

Nellore News : రైల్వే ట్రాక్ మధ్యలో దర్గా, నెల్లూరులో ఇదో అద్భుతం  

భగవద్గీత ఓ మత గ్రంధం మాత్రమే కాదు జీవిత సత్యాన్ని బోధించే వ్యక్తిత్వ వికాసం  

భగవద్గీత ఓ మత గ్రంధం మాత్రమే కాదు జీవిత సత్యాన్ని బోధించే వ్యక్తిత్వ వికాసం  

Tirumala Updates : ప్రతి శుక్రవారం ఆకాశ గంగ నుంచి శ్రీవారి ఆలయానికి పవిత్ర జలాలు, ఎందుకో తెలుసా !

Tirumala Updates : ప్రతి శుక్రవారం ఆకాశ గంగ నుంచి శ్రీవారి ఆలయానికి పవిత్ర జలాలు, ఎందుకో తెలుసా !

Krishna Janmashtami 2022: పుట్టకముందే శత్రువు సిద్ధం, పుట్టాక రోజుకో గండం - అయినా అడుగుకో పాఠం నేర్పించిన శ్రీ కృష్ణుడు

Krishna Janmashtami 2022: పుట్టకముందే శత్రువు సిద్ధం, పుట్టాక రోజుకో గండం - అయినా అడుగుకో పాఠం నేర్పించిన శ్రీ కృష్ణుడు

Horoscope Today 18 August 2022: మేషం, వృషభం సహా మరో మూడు రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, ఆగస్టు 19 రాశిఫలాలు

Horoscope Today 18 August 2022:  మేషం, వృషభం సహా మరో మూడు రాశులవారు ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు, ఆగస్టు 19 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం