News
News
X

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

హిందువులు తరతరాలుగా కొన్ని పద్ధతులు పాటిస్తూ వస్తున్నారు. ఎందుకలా అని క్వశ్చన్ చేస్తే..ఏమో పెద్దోళ్లు పాటించారు ఇప్పుడు తాము ఫాలో అవుతున్నాం అంటారు. కానీ పాటించే ప్రతి పద్దతి వెనుకా ఆంతర్యం ఉంది..

FOLLOW US: 

“ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి || ”

“ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు' అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఈ సృష్టిలో తన ప్రమేయం లేకుండా జరిగే రెండు చర్యలివి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తనకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా వారివారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారం కాలుస్తారు లేదంటే పూడ్చిపెడతారు. అయితే అంత్యక్రియల సమయంలో  మృతదేహం చుట్టూ కుండపట్టుకుని తిరుగుతారు, దానికి రంధ్రాలు పెడతారు, ఆఖర్లో కుండ పగలగడతారు. ఎందుకు అని అడిగితే అలా చేస్తారుకదా అందుకే ఫాలో అవుతున్నాం అంటారు. కానీ దానివెనుకున్న ఆంతర్యం ఏంటంటే..

Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

కుండ-కుండలోని నీరులా శరీరం, ఆత్మ రెండూ వేర్వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ వందేళ్లు బతికి ఉంటే పూర్ణాయుష్షు అని ఫిక్సైపోయారు. కానీ మారుతున్న అలవాట్లు, వాతావరణం ప్రభావంతో 70 దాటితే గొప్ప అన్నట్టుంది పరిస్థితి. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ అందులో ఉండలేదు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది.అ శరీరానికి అంత్యక్రిలు నిర్వహించేవరకూ..ఆత్మ మళ్లీ తన శరీరాన్ని మేల్కొలపాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందట. అందుకే పాడెకట్టి శరీరాన్ని తీసుకెళ్లినప్పుడు శ్మశానానికి కొద్దిదూరంలో దింపి... బియ్యం కానీ, ఆవాలు కానీ కట్టిన మూటను విప్పి కింద పోస్తారు. ఆతర్వాత శరీరాన్ని తీసుకెళ్లి దహనం చేస్తారు. కాలి బూడిదైన తర్వాత కూడా ఆ ఆత్మ వెళ్లిపోకుండా వెనక్కు తిరిగి రావాలని చూస్తే శరీరంపై చల్లిన పేలాలు, బియ్యం పూర్తిగా లెక్కించాలని అదికూడా చీకటి పడేలోగా మాత్రమే అని చెబుతారు.

Also Read: భగవద్గీత మా అమ్మ లేని లోటు తీర్చిందన్న స్వాతంత్ర్య సమరయోధుడెవరు… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 2

ఇక కుండ విషయానికొస్తే..శరీరాన్ని చితిపై పెట్టి కుండలో నీరు పోసి రంధ్రాలు చేస్తూ చుట్టూతిరుగుతారు. కుండ శరీరం.. అందులో నీరు ఆత్మలాంటివి. కుండకు కన్నం పెట్టగానే నీరు బయటకు వచ్చేసినట్టు..ప్రాణం పోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని వీడిపోవాలనే సంకేతం అది. కన్నం పడిన కుండ పనికిరానట్టే..ఈ శరీరం కూడా ఇకపనికిరాదు..దీన్ని విడిచిపో అని ఆత్మకు చెప్పడం. 

Also Read: భగవద్గీత బోధన తర్వాత విశ్వరూపం చూసింది కేవలం అర్జునుడు మాత్రమే కాదు.. మరో మగ్గురున్నారు, ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 5

Note: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల ఆధారంగా చేసుకుని రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం....

Published at : 15 Aug 2022 04:22 PM (IST) Tags: Bhagavad Gita Holes to Pots in Cremation Pots in Cremation

సంబంధిత కథనాలు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Bheeshma Neeti: ఉన్నత పదవుల్లో ఎవరిని నియమించాలి, ధర్మరాజుకి భీష్ముడు ఏం చెప్పాడంటే!

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Karwa Chauth Atla Taddi 2022: 'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Karwa Chauth Atla Taddi 2022:   'అట్ల తదియ' ఆంతర్యం ఏంటి, మొదటగా ఈ నోము నోచిందెవరు, తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలేంటి!

Horoscope Today 7th October 2022: ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

Horoscope Today 7th  October 2022:  ఈ రాశివారు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు తిరిగి రావు, అక్టోబరు 7 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!