Happy Eid-ul-Adha Wishes In Telugu 2023 : బక్రీద్ సందర్భంగా ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి!
జూన్ 29 గురువారం బక్రీద్. మొరాకో, ఈజిప్ట్, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇలో జూన్ 28న బక్రీద్ కాగా.. ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి
Happy Eid-ul-Adha Wishes In Telugu 2023 : బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ అని అర్థం. జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో బక్రీద్ పండుగ వస్తుంది. జిల్ హజ్ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ముస్లింలు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యం. ఈ ఏడాది జూన్ 29న బక్రీద్ సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.
త్యాగలకు ప్రతీక అయిన బక్రీద్ సందర్భంగా
మీకు, మీ కుటుంబ సభ్యులకూ శుభాకాంక్షలు
అల్లా ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి
ఈద్ ముబారక్!
ఈ పవిత్ర సందర్భంలో అల్లా మీ త్యాగాలను గుర్తించి
మీ కోర్కెలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈద్ ముబారక్!
జాలి, దయ, కరుణ, ప్రేమ, త్యాగం
ఇవన్నీ మన జీవితాల్లో భాగం
ఆ అల్లాహ్ చల్లని చూపులు
మనపై ఎప్పటికీ ఉంటాయి
హ్యాపీ ఈద్ ముబారక్
ఒకే ఒక జీవితాన్ని ప్రేమ, త్యాగాలతో నింపుకోవాలి
ప్రతి క్షణాన్నీ ప్రేమించాలి
మీకు బక్రీద్ శుభాకాంక్షలు
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
మీరు మరింత అభివృద్ధి చెందాలి
ఈద్ అల్ అధా ముబారక్
ఆ దేవుడి చల్లటి చూపులు
భవిష్యత్తుపై ఆశల్ని పెంచుతాయి
అల్లాహ్ దయ ఎప్పటికీ నిలిచివుండాలని
కోరుకుంటూ ఈద్ ముబారక్
ఈద్ అల్ అధా ముబారక్
మీరు, మీ కుటుంబం
ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి
Also Read: ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఎందుకు జరుపుకుంటారు
త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ అల్ అధా సందర్భంగా
అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు
త్యాగాలకు సిద్ధపడే వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం
అలాంటి వారిపై అల్లాహ్ దయ ఎప్పటికీ ఉంటుంది
హ్యాపీ ఈద్ ముబారక్
త్యాగం వెనక ప్రేమ ఉంటుంది
ప్రేమ వెనక దైవం ఉంటుంది
ప్రేమతో చేసే ప్రతీదీ తియ్యగా ఉంటుంది
త్యాగాల పండుగ హ్యాపీ ఈద్ అల్ అధా
మీకు మీ కుటుంబ సభ్యులకూ
ఈద్ అల్ అధా శుభాకాంక్షలు
ఈ ఈద్ మీ జీవితంలో
సరికొత్త వెలుగులు నింపాలని
కోరుకుంటూ హ్యాపీ బక్రీద్
యుద్ధాలు అశాంతి రగిలిస్తాయి
త్యాగాలు ప్రేమను చిగురింపజేస్తాయి
త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్
సందర్భంగా శుభాకాంక్షలు
మన ప్రార్థనలు, త్యాగాలూ
ఎప్పటికీ వృథా కావు
ఈద్ అల్ అధా సందర్భంగా
అల్లా దీవెనలు అందుకోండి
ఈద్ ముబారక్
అల్లాహ్ చల్లని చూపులు, ప్రేమ..
ప్రపంచ ప్రజలను దయామయులుగా చేస్తాయి
ప్రేమను పంచి, త్యాగాలను స్మరించే
ఈద్ అల్ అధా శుభాకాంక్షలు
Also Read: తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
ఈద్ సందర్భంగా ప్రియమైన వారికి
పూలగుత్తి ఇవ్వండి. ప్రేమను పంచండి.
వారి త్యాగాలను స్మరించండి.
ఆనందంగా జీవించండి.
హ్యాపీ ఈద్ అల్ అధా
మన జీవితాలు అల్లాహ్ నిర్దేశించినవే.
ఆయన చూపిన శాంతియుత మార్గం
మనల్ని ముందుకు నడిపిస్తుంది.
త్యాగం ఇచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది.
అందరికీ ఈద్ ముబారక్