Tholi Ekadashi Wishes In Telugu 2023: తొలిఏకాదశి (జూన్ 29) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజు నుంచి ప్రతి పదిహేను రోజులకోసారి ఏవో పండుగలు ఉంటూనే ఉంటాయి. ఈ సందర్భంగా తొలిఏకాదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Tholi Ekadashi Wishes 2023: ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలిఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉంది జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువుని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఈ యోగ నిద్ర ద్వారా భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెబుతారు. ఇంత ప్రత్యేకమైన ఈ రోజున మీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులకు తొలిఏకాదశి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కొటేషన్స్ మీకోసం..
Also Read: తొలి ఏకాదశి(జూన్ 29 ) ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!
ఓం నమోహః భగవతే వాసుదేవాయః
మీకు మీ కుటంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥
అందరకీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
Also Read: ఆదిపురుష్ ఎఫెక్ట్ - రామానంద్ సాగర్ 'రామాయణం' మళ్లీ ప్రసారం!
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ౹
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹
దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
లక్ష్మీనారాయణుడి దీవెనతో
మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ
తొలిఏకాదశి శుభాకాంక్షలు
పరమపవిత్రమైన ఈ రోజున శ్రీ మహా విష్ణువు కరుణా కటాక్షాలు మీపై
మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లేలా
శ్రీ మహా విష్ణువు కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
Also Read: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!
సర్వభూత శరణ్యాయ సర్వ జ్ఞాయ నమోనమః
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే !!
మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
నమః పంకజ నేత్రాయ జగద్ధాత్రే చ్యుతాయచ
హృషీకేశాయ సర్వాయ నమః కమలమాలినే !!
మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
అనంత నాగ పర్యంకే సహస్త ఫణ శోభితే
దీప్యామానే మేల్ దివ్యే సహస్రార్క సమప్రభే !!
మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.