అన్వేషించండి

Ramayan: ఆదిపురుష్ ఎఫెక్ట్ - రామానంద్ సాగర్ 'రామాయణం' మళ్లీ ప్రసారం!

‘రామాయణం’ పేరు వినగానే ప్రేక్షకులకు రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ సీరియల్ గుర్తొస్తుంది. 1980 నాటి ఈ సీరియల్‌ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. ఆదిపురుష్ మూవీ కారణంగా మరోసారి టీవీల్లో సందడి చేయబోతోంది

Ramayan: 1980ల్లో దర్శకనిర్మాత రామానంద్‌ సాగర్‌ రూపొందించిన రామాయణం టీవీలో ప్రసారమై కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఆ మధ్య కరోనా సమయంలో మరోసారి ప్లే చేశారు కూడా. తాజాగా మరోసారి టీవీల్లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమవుతోంది రామానందసాగర్ రామాయణం. ఆదిపురుష్ అనే పౌరాణిక డ్రామా విపత్తు నుంచి 'నేషనల్ డిటాక్స్' కోసం రామానంద్ సాగర్ జీ రామాయణాన్ని తిరిగి ప్రసారం చేయాలన్న ఓ నెటిజన్ కోర్కె మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. అరుణ్ గోవిల్ - దీపికా చిక్లియా నటించిన రామాయణం  జూలై 3 న సాయంత్రం 7:30 గంటలకు షో ప్రసారం ప్రారంభం కానుంది. 

Also Read: చాతుర్మాస్య దీక్ష చేస్తే పొలిమేర దాటకూడదా - ఈ దీక్ష వెనుకున్న ఆంతర్యం ఏంటి!

రామాయణం కథ ఆధారంగా రీసెంట్ గా  తెరకెక్కిన ఆదిపురుష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరికి రాముని లుక్‌ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. ఇంకొందరు అభిమానులకు రావణుడి ఆహార్యంమే నచ్చలేదు. కొన్ని సన్నివేశాలపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామానందసాగర్ రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్‌ గోవిల్‌ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు.  రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదన్నారు అరుణ్‌ గోవిల్. ఇక నెటిజన్ల విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడేశారు. ఇలాంటి టైమ్ లో ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అయింది. 'ఆదిపురుష్' అనే పౌరాణిక డ్రామా విపత్తు నుంచి 'నేషనల్ డిటాక్స్' కోసం రామానంద్ సాగర్ జీ రామాయణాన్ని తిరిగి ప్రసారం చేయడం ప్రారంభించాలి అని కోరాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. జూలై 3 సాయంత్రం 7:30 గంటలకు షో ప్రసారం ప్రారంభం కానుంది. 

మేకర్స్ టీవీ షో నుంచి ఒక చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి...  "ప్రపంచ ప్రఖ్యాత పౌరాణిక సీరియల్ రామాయణం అభిమానులందరి కోసం మా ప్రేక్షకుల కోసం తిరిగి వచ్చింది. జూలై 3, రాత్రి 7.30 నుంచి మీ ఇష్టమైన ఛానెల్ షెమరూలో చూడండి."  అని పోస్ట పెట్టారు నిర్వాహకులు.  ఈ పోస్ట్ పెట్టిన వెంటనే కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. ఆ మధ్య కరోనా సమయంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్‌లో పౌరాణిక ధారావాహికను తిరిగి ప్రసారం చేయమని కోరిన తర్వాత కూడా ప్రసారం అయింది. తాజాగా జూలై 3 సోమవారం నుంచి ఆదివారం వరకు రాత్రి 7:30 గంటలకు షెమరూ టీవీలో ప్లే కానుంది.

Also Read: చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!

పౌరాణిక గాధల్ని ఇకపై తీయొద్దు- దీపిక చిక్లియా
దీపిక చిక్లియా ఇన్ స్టాలో ఇటీవల ఒక వీడియోను షేర్ చేసారు. నమస్కార్ నేను ఈ వీడియోను రూపొందించాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ ఆదిపురుష్ గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. నేను ఇంకా  సినిమా చూడలేదు కాబట్టి దానిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడను. కానీ భవిష్యత్తు గురించి మాట్లాడతాను. సంవత్సరాలుగా సినిమాలు లేదా టీవీ సీరియల్ లలో ఆధునిక రామాయణం అద్భుతంగా రూపొందింది. భారతీయులమైన మనకు రామాయణం మనదైన పౌరాణిక గాధ కాబట్టి ఇకపై రీమేక్ లు చేయడం మానేయాలని నేను భావిస్తున్నాను. అన్నది ఆ వీడియో సారాంశం . 'ఆదిపురుష్' పై వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని రామానంద్ సాగర్ రామాయణం నటి దీపిక చిక్లియా ఇలా అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget