అన్వేషించండి

Guru Purnima 2023: గురు పూర్ణిమ (జూలై 3) విశిష్టత ఏంటి, మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు ఆదిగురువు ఎలా అయ్యాడు!

ఆషాఢ శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. పురాణ కాలం నుంచి గురువు అనగానే వ్యాసుడినే ఎందుకు పూజిస్తారో తెలుసా

Guru Purnima 2023: సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు.

Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!

మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు
అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు జన్మించింది ఓ మత్స్య కన్యకి. పడవనడుపుకునే దాశరాజు కుమార్తె పేరు మత్స్య గంధి.  ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. యుక్త వయస్సు వచ్చాక తండ్రికి సాయంగా  యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది. ఒక రోజు వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనం చేసేందుకు కూర్చుంటాడు. మహర్షిని ఆవతలి ఒడ్డుకి తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు దాశరాజు. సరేనన్న మత్స్యగంధి  పరాశర మహర్షిని ఎక్కించుకుని ఆవలి ఒడ్డుకి తీసుకెళుతుంటుంది. ఆ సమయంలో మత్స్య గ్రంధిని చూసి పరాశమ మహర్షి మనసు చలించింది.తన మనసులో కోర్కెను ఆమెకు చెప్పాడు పరాశర మహర్షి. అంతటి మహర్షి అలా అడిగేసరికి మత్స్య గంధి తను ఏమనుకుందో చెబుతుంది.
మత్స్య గంధి:  ఇంతటి మహానుభావులు , కాలజ్ఞానులైన మీరు  ఇలా ఎలా ఆలోచిస్తారు. పైగా పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని మీకు తెలియదా
పరాశర మహర్షి:  అందుకు సమాధానంగా పడవ చుట్టూ ఓ మాయా తిమిరం ( చీకటిని) సృష్టించాడు.
మత్స్య గంధి:  మీ కోరిక తీరిస్తే నా కన్యత్వం భంగమవతుంది తిరిగి నా తండ్రికి ముఖం ఎలా చూపించాలి
పరాశర మహర్షి:  నాతో సంగమించిన తరువాత కూడా కన్యత్వం చెడదు అని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు
మత్స్య గంధి: నా శరీరం నుంచి వస్తున్న ఈ మస్త్యగంధం( చేపలకంపు) నచ్చలేదు, దాన్నుంచి విముక్తి చేయండి మహర్షి
పరాశర మహర్షి: ఆ వరంతో పాటూ ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజనదూరం వరకూ వ్యాప్తిచెందుతుందని వరమిస్తాడు. అప్పటి నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారిపోయింది.  అప్పుడు వారిద్దరి కలయికతో జన్మించిన పుత్రుడే వ్యాసుడు

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు
సూర్యసమాన తేజస్సుతో, సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు తపస్సుకి వెళుతున్నా అని తల్లితో చెబుతాడు. అయితే ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. చిన్నప్పుడే ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు. మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతకథలో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు. 

భరత వంశాన్ని నిలిపినది వ్యాసుడే
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత యోజనగంధి అయిన సత్యవతి…భీష్ముడి తండ్రి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. సత్యవతి తండ్రి దాశరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందుతారు. ఇక భరతవంశాన్ని నిలిపేందుకు సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.  ఆతర్వాత కూడా భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు.

వ్యాసుడు జన్మించిన రోజే గురు పూర్ణిమ
మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి అందించారు. వేదాలను నాలుగు బాగాలుగా చేశాడు కాబట్టే వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసుని పుట్టిన రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. కాబట్టి దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget