Gold Astrology: బంగారం దాచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే నష్టమే! వాస్తు ప్రకారం సరైన దిశ, జాగ్రత్తలు తెలుసుకోండి
Astrology: హిందూ మతంలో బంగారం లక్ష్మీదేవికి ప్రతీక. జ్యోతిషశాస్త్రంలో గురు, సూర్యుడితో ముడిపడి ఉంది. ఇనుప బీరువాలో బంగారం ఉంచడం వల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి.

Gold Astrology: ఇంట్లో సంపద, ఆభరణాలు కూడా ఇంటి శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. అయితే, డబ్బు, ఆభరణాలు సరిగ్గా జాగ్రత్తగా ఉంచుకుంటేనే పెరుగుతాయి. బంగారం విషయానికి వస్తే, హిందూ మతంలో దీనిని కేవలం లోహం లేదా ఆభరణంగా పరిగణించరు..లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం కూడా బంగారం ధరించడం, దానిని ఎలా భద్రపరచాలి, సరైన దిశ వంటి వాటి గురించి చెబుతాయి. ఎందుకంటే సరైన దిశ, సరైన వస్తువులు డబ్బు, ఆనందం, శ్రేయస్సు, స్థిరత్వంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. శాస్త్రాలలో, ముఖ్యంగా ఇనుప లాకర్‌లో బంగారం లేదా బంగారు ఆభరణాలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడదు. కానీ చాలా మంది సాధారణంగా ఈ పొరపాటు చేస్తారు. మీరు కూడా ఇనుప అల్మారా లేదా లాకర్‌లో బంగారం ఉంచుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి, దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోండి.
ఈ నష్టాలు సంభవించవచ్చు
జ్యోతిష్య పండితులు అనిష్ వ్యాస్ ప్రకారం, బంగారం ఇనుప లాకర్ లేదా అల్మారాలో ఉంచితే, అది గ్రహాల స్థాయిలో అశుభ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం, బంగారం గురు గ్రహంతో ముడిపడి ఉంటుంది, ఇది డబ్బు, జ్ఞానం, అదృష్టం, విస్తరణకు కారకం. మరోవైపు, ఇనుము శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది, ఇది కర్మ, సంఘర్షణ, ఆలస్యం, కఠినత్వానికి కారకంగా పరిగణిస్తారు. బంగారు వస్తువులను ఇనుము బీరువాలో ఉంచినప్పుడు, గురు, శని గ్రహాల మధ్య ఘర్షణ ఏర్పడవచ్చు. ఎందుకంటే గురు గ్రహం (బంగారం) శని గ్రహం (ఇనుము)లో బంధించినప్పుడు, దానిని శని-గురు ఘర్షణగా పరిగణిస్తారు. ఈ ఘర్షణ వ్యక్తి ఆర్థిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
బంగారాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, బంగారు ఆభరణాలను చెక్క అల్మారాలో ఉంచడం ఉత్తమమని భావిస్తారు. మీరు పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి కూడా అల్మారాలో బంగారం ఉంచవచ్చు. వాస్తు ప్రకారం, బంగారం ఉంచడానికి ఉత్తర లేదా ఈశాన్య దిశ శుభప్రదమైనది.
ఉత్తర దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడిది. లాకర్ తలుపు ఉత్తరం లేదా తూర్పు దిశగా తెరుచుకునేలా ఉండాలి, ఇలాచేస్తే ధనం పెరుగుతుంది. ఇది వాస్తు శాస్త్ర నిపుణులు వివరించినదే
నైరుతి దిశ భూమితత్వానికి సంబంధించినది. రక్షణకు సంబంధించిన ఈ దిశలో బంగారం, ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచితే సంపద స్థిరంగా ఉంటుంది. లాక్షణం దక్షిణం లేదా పశ్చిమ గోడకు ఆనించి పెట్టాలి తలుపులు ఉత్తరం, తూర్పు వైపు తెరుచుకునేలా ఉండాలి
వాయువ్య దిశలో బంగారం ఉంచితే ధన నష్టం తప్పదు
అగ్నికోణం అయిన ఆగ్నేయంలోనూ బంగారం ఉంచకూడదు
మంచంమీద, పడకగదిలో బంగారం ఉంచకూడదు అని చెబుతారు కొందరు వాస్తు నిపుణులు
బీరువా లాకర్ ఎప్పుడూ దక్షిణం వైపు తెరుచుకుని ఉండకూడదని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర పండితులు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















