Garuda Purana : ఈ ఆత్మలే దెయ్యాలు, ప్రేతాత్మలుగా మారుతాయి!
Garuda Purana : మరణం తరువాత, కొన్ని ఆత్మలు మళ్లీ మానవ జన్మ పొందుతాయి. మరికొన్ని దెయ్యాలుగా మారతాయి. గరుడ పురాణం ప్రకారం ఏ ఆత్మలు ప్రేతాత్మలుగా మారతాయో తెలుసా? దెయ్యాలుగా తిరిగే ఆత్మలు ఇవే..!
Garuda Purana : గరుడ పురాణం మరణం, మరణానంతర సంఘటనలను వివరంగా వివరించే హిందూ గ్రంథం. ఈ గ్రంథంలో శ్రీ మహావిష్ణువు తన వాహనమైన పక్షిరాజు గరుడుడికి మరణం గురించి చెప్పిన వివరణను తెలుసోవచ్చు. గరుడ పురాణం జననం, మరణం, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పాపం, పుణ్యం, నీతి, ధర్మం, జ్ఞానానికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంది. దీనితో పాటు, మరణం తరువాత ఆత్మ మానవ రూపంలోకి, ప్రేత రూపంలోకి మారడం గురించి కూడా స్పష్టంగా వివరించింది. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : అబద్దాలు చెప్పేవారిని ఈ లక్షణాలతో గుర్తించవచ్చు
1. మరణం తర్వాత
మరణానంతరం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆకలి, దాహం, కోపం, దుఃఖం, కామం అనే లక్షణాలు ఉంటాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల జీవుల ప్రస్తావన ఉంది. ఇందులో జంతువు, పక్షి, చెట్టు, క్రిమి కీటకాలు, మానవుడు వంటి ఆత్మలు ఉన్నాయి. మరణం తరువాత, ఒక వ్యక్తి ఆత్మ ఏ జన్మకు వెళ్తుందో, అది అతని జీవితకాలంలో చేసిన పనులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దుర్మార్గుల ఆత్మలు మృత్యులోకంలో సంచరిస్తూనే ఉంటాయి. మరోవైపు.. ప్రమాదం, హత్య లేదా ఆత్మహత్య మొదలైన వాటి కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే, అంటే.. ఆత్మ తన శరీరాన్ని సహజ మరణంతో విడిచిపెట్టకపోతే, ఆత్మ ప్రేతాత్మగా మారి తిరుగుతుంది.
2. దెయ్యాల రహస్యం ఏంటి..?
గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ శాంతిని పొందదు లేదా ఆత్మ సహజమైన పద్ధతిలో తన శరీరాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో ఆత్మ ప్రేతాత్మగా సంచరిస్తూనే ఉంటుంది. అందుకే మరణానంతరం మరణించిన వ్యక్తికి నిర్వహించాల్సిన పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మల గురించి గ్రంథాలు చెబుతున్నాయి. నియమానుసారంగా పిండప్రదానం, శ్రాద్ధ కర్మలను ఆచరించడం వల్ల పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది.నెరవేరని కర్మలు లేదా చెడు పనుల వల్ల ఆత్మలు మృత్యు భూమిలో సంచరిస్తూనే ఉంటాయి. ఇలా ప్రేతాత్మలుగా మారిన ఆత్మలు ఏ రూపంలో ఉన్నా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి ఆత్మలను మనం సాధారణ పరిభాషలో దెయ్యాలు అంటాము. అందుకే మానవుడు తన జీవితకాలంలో పాప కర్మలు చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది.
Also Read : శిరస్సు లేని ఈ అమ్మవారికి పసుపు నీళ్లతో మొక్కులు తీర్చుకుంటే చాలు
తన జీవిత కాలంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుణ్యకార్యాలు ఆచరించేవాడు అందరికీ సుఖ సౌఖ్యాలు కలిగించి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని గరుడ పురాణం స్పష్టం చేస్తోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.